Saturday, May 25, 2024
- Advertisement -

గాంధీజీ జీవితం.. నేర్పుతున్న సత్యం !

- Advertisement -

మన దేశ చరిత్రలో మహాత్మా గాంధీ ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 200 సంవత్సరాల బ్రిటిష్ వారి దాస్యం నుంచి మన దేశానికి విముక్తి కల్పించడంలో ఎంతో మంది మహానుభావులు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించారు. అయితే వారందరిలోకెల్లా మహాత్మా గాంధీ చాలా ప్రత్యేకం. హింసకు హింసే పరిష్కారం కాదని, అహింసా మార్గాన్ని ఎంచుకొని, యావత్ దేశ ప్రజలలో స్వాతంత్ర్య నినాదాన్ని నరనరాల్లో నింపి ఉక్కు పోరాటం సాగించిన మహనీయుడు మహాత్మా గాంధీ. మరో వైపు తెల్లవాళ్లు దేశ ప్రజలపై మరణకాండ సృష్టిస్తున్న తాను నమ్మిన అహింసా సిద్దాంతన్ని ఏ మాత్రం వదలక.. చివరకు అహింసాతోనే స్వాతంత్ర్యాన్ని సాధించిన యోధుడు మహాత్మా గాంధీ. అక్టోబర్ 2 న ఆ మహనీయుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను మరొకసారి తెలుసుకుందాం !

మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2 న గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ లో జన్మించారు. ఈయన అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన తండ్రి రాజకీయ నాయకుడు కావడంతో చిన్నతనం నుంచే గాంధీపై రాజకీయ ప్రభావం గట్టిగానే ఉండేది. ఇక గాంధీ చిన్నతనంలో చూసిన సత్యహరిచంద్ర నాటకం ఆయన వ్యక్తిత్వంపై చాలా ప్రభావం చూపింది. 19 సంవత్సరాల వయసులో న్యాయశాస్త్ర విధ్యాభ్యాసానికి ఇంగ్లండ్ వెళ్ళిన గాంధీకి బెర్నాల్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. ఈ సమయంలోనే గాంధీ అనేక మతాల పవిత్ర గ్రంధాలను చదివాడు. గాంధీజీ పుస్తకాలు చదవడానికి అధిక సమయం కేటాయించేవాడు. న్యాయవాద శిక్షణకు దక్షిణాఫ్రికా వెళ్ళిన గాంధీకి ఎదురైన పరాభవం ఆయన జీవితంపై పెను ప్రభావం చూపింది. రైల్లో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణిస్తున్న గాంధీని నల్లజాతీయుడు అని ఆయనను రైల్లో నుంచి గెంటివేశారు. ఈ సంఘటన గాంధీ పోరాటానికి నాంది పలికింది. ఆ తరువాత స్వదేశానికి తిరోగోచ్చిన గాంధీకి మన దేశంలో నెలకొన్న బానిసత్వ పరిస్థితులు ఏమాత్రం రుచించలేదు. స్వతంత్రనికై నడుం బిగించాడు.

తాను నమ్మిన సత్యం, అహింసా సిద్దాంతలనే ఆయుధాలుగా చేసుకొని, దేశ ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను పెంపిండించాడు. 1919 లో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా మొదటి సారి గాందిజీ ఉద్యమం చేపట్టారు. ఇక ఆ తరువాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాలు అనిర్వచనీయం. ఇక ఆ తరువాత 1920 లో చేపట్టిన సహాయనిరాకరణ ఉద్యమం, 1930లో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం, 1942 లో చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారి పునాదులు కదిలేలా చేశాయి. ఇక గాంధీ ఉద్యమ శక్తి ముందు బ్రిటిష్ వారు తలవంచక తప్పలేదు. ఎంతో మంది స్వతంత్ర సమరయోడులు ఎన్నో పోరాటాలు చేసిన.. కేవలం అహింసతోనే స్వాతంత్ర్యానికి నాంది పలికిన గాంధీ సిద్దాంతలు నేటి యువతరానికి ఎంతో స్పూర్తిదాయకం. అందుకే ప్రపంచమంత కూడా ఆయనను జాతిపితగా అభివర్ణిస్తుంది. ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల చేత బాపుగా కొనియాడబడుతూ, మహాత్మాగా మనదేశ చరిత్రలో గాంధీజీ ఎప్పటికీ చెరిగిపోని సంతకం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -