Thursday, April 25, 2024
- Advertisement -

త్వరగా కూల్చకపోతే సిడ్నీలో గండమే!

- Advertisement -

సిడ్నీ టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియాకు 94 పరుగులు తొలి ఇన్నింగ్స్‌ లభించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 96/2 తో మూడోరోజు ఆట ప్రారంభించిన టీమిండియాను కమిన్స్‌ (29 పరుగులకు 4 వికెట్లు) దెబ్బ కొట్టాడు. హేజిల్‌వుడ్‌ రెండు, స్టార్క్‌ ఒక వికెట్‌ తీశాడు. భారత బ్యాట్స్‌మెన్లలో ముగ్గురు రనౌట్‌ కావడం దారుణం. దీంతో క్రితం రోజు స్కోరుకు 148 పరుగులు మాత్రమే జోడించిన రహానే సేన ప్రత్యర్థి కంటే వెనుకబడిపోయింది.

సా….గిన బ్యాటింగ్
105.4 ఓవర్లు ఆడిన ఆతిథ్య జట్టు 344 పరుగులు చేయగా…. 100.4 ఓవర్లు ఆడిన టీమిండియా 244 పరుగులు చేసింది. టెస్టుల్లో నెమ్మదైన ఆట అవసరం అయినప్పటికీ.. ఈసారి ఆ నెమ్మది మరింత నెమ్మదించింది. దీంతో ఆతిథ్య జట్టుకు 94 ఆధిక్యం ఇచ్చుకోక తప్పలేదు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్‌ రహానే 22 పరుగులు చేయగా.. పుజారా తన సహజసిద్ధమైన ఆటతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జడేజా (37 బంతుల్లో 28), పంత్‌ (67 బంతుల్లో 36) ఫరవాలేదు అనిపిపంచారు. అశ్విన్‌ (10), బుమ్రా (0), సిరాజ్‌ (6), త్వరత్వరగా పెవిలియన్‌ చేరారు.

250పైగా అయితే కష్టమే
రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం రెండు వికెట్లు కోల్పోయి 80 పరుగులతో ఉన్న ఆతిథ్య జట్టు మరో 80 పరుగులు చేస్తే ప్రత్యర్థి ముందు 250కి పైగా లక్ష్యాన్ని ఉంచగలుగుతుంది. సిడ్నీలో విజయానికి ఈ మాత్రం పరుగులు చాలునని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. పేస్‌ బౌలింగ్‌కు అనుకూలమైన సిడ్నీ పిచ్‌పై 250కి పైగా లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడుతున్నారు. కమిన్స్‌, హేజిల్‌వుడ్‌, స్టార్క్‌ త్రయాన్ని దాటుకుని వికెట్లు కాపాడుకోవడం కూడా భారత బ్యాట్స్‌మెన్‌ వల్ల కాదని జోస్యం చెప్తున్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న తరుణంలో ఫలితం ఎలా ఉండబోతోందో నాలుగో రోజైన ఆదివారం తెలుస్తుంది!

ఛీ.. ఆసీస్ క్రికెట‌ర్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు

ల‌బుషేన్ స్లెడ్జింగ్‌.. కౌంట‌ర్ ప‌డిందిగా!

క్యాచ్‌ మిస్‌ అనుకున్నాం, కానీ..

రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -