Friday, May 3, 2024
- Advertisement -

స్మిత్‌కు బాస‌ట‌గా నిలిచిన గంగూలి..

- Advertisement -

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకుని ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌కు టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మద్దతుగా నిలిచాడు. స్మిత్‌ ఒక అద్భుతమైన క్రికెటర్‌ అని పేర్కొన్న గంగూలీ.. అతన్ని మోసగాడిగా చూడొద్దంటూ హితవు పలికాడు.

స్మిత్ ఆస్ట్రేలియా జట్టులోకి పునరాగమనం చేసి మెరుగైన స్కోర్లు చేయాలని కాంక్షించాడు. తాను రాసిన ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ పుస్తకాన్ని ముంబయిలో ఆవిష్కరించిన గంగూలీ బాల్ టాంపరింగ్ వివాదంపై సుదీర్ఘంగా మాట్లాడాడు. స్టీవ్‌స్మిత్‌ని ఓ మోసగాడిగా చూడొద్దని.. స్మిత్‌తో పాటు నిషేధానికి గురైన డేవిడ్ వార్నర్, బ్రాన్‌క్రాఫ్ట్ మళ్లీ ఆస్ట్రేలియా తరఫున ఆడతారని ఆశాభావం వ్యక్తం చేశాడు.

స్టీవ్‌స్మిత్‌పై నాకు సానుభూతి ఉంది. అతను అద్భుతమైన ఆటగాడు. తప్పకుండా మళ్లీ ఆస్ట్రేలియా తరఫున మైదానంలోకి దిగి స్కోర్లు చేస్తాడని నా నమ్మకం. అతను చేసింది మోసమని నేను భావించట్లేదు. అలా అనడం కూడా భావ్యం కాదేమో..? నిషేధానికి గురైన స్టీవ్‌స్మిత్, డేవిడ్ వార్నర్, బ్రాన్‌క్రాఫ్ట్‌లు మళ్లీ ఆడతారు. వారికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’ అని గంగూలీ వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -