Thursday, May 2, 2024
- Advertisement -

స్మిత్ బాట‌లో వార్న‌ర్‌…

- Advertisement -

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం తన సహచర ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, బాన్‌ క్రాఫ్ట్‌ బాటలోనే నడుస్తానని అంటున్నాడు. తనపై విధించిన నిషేధాన్ని సవాల్‌ చేయబోనని వార్నర్‌ స్పష్టం చేశాడు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బౌలర్ బ్రాన్‌క్రాఫ్ట్ బాల్ టాంపరింగ్‌కి పాల్పడేలా డేవిడ్ వార్నర్ ప్రోత్సహించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారుల విచారణలో తేలింది. దీంతో సీఏ అతడితో పాటు స్టీవ్‌స్మిత్‌‌పై ఏడాది, బ్రాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు నిషేధం విధించింది. ఈ శిక్షను సవాల్ చేసే అవకాశం ఉన్నా.. డేవిడ్ వార్నర్ అందుకు నిరాకరించాడు. ఇప్పటికే స్మిత్, బ్రాన్‌క్రాఫ్ట్‌లు సైతం శిక్షను సవాల్ చేసే విషయంలో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

క్రికెట్ ఆస్ట్రేలియా వేసిన శిక్షతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చేసిన తప్పుకి భేషరుతుగా క్షమాపణలు చెప్తున్నా. ఓ మంచి వ్యక్తిగా మారేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తాను. మంచి సహచరుడిగా, స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా మారేందుకు ప్రయత్నిస్తా’ అని డేవిడ్ వార్నర్ ఉద్వేగంగా వివరించాడు. సీఏ శిక్షను సవాలు చేయడం లేదని ఈ నిషేద కాలాన్ని పూర్తిచేసుకోని ఆస్ట్రేలియా ప్రజల మనసు గెలుచుకున్న తర్వాతే మైదానంలో అడుగుపెడుతామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -