Thursday, May 2, 2024
- Advertisement -

చరిత్ర లిఖించిన తెలుగు షట్లర్ పీవీ సింధు

- Advertisement -

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అధ్యాయం నమోదైంది. ఎన్నాళ్లుగానో వేచిచూస్తున్న క్షణం రానేవచ్చింది. శతకోటి భారతావని మది ఉప్పొంగేలా తెలుగుతేజం పూసర్ల వెంకటసింధు కొత్త చరిత్రకు నాంది పలికింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలుపొందిన తొలి భారత షట్లర్‌గా పీవీ సింధు రికార్డు లిఖించింది.

తొలి గేమ్ లో ఒకుహారా (జపాన్)పై 21-7 తేడాతో అలవోకగా గెలిచిన సింధు రెండో గేమ్లో 21-7 తేడాతో వరస సెట్లను సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డులకెక్కింది. 38 నిమిషాల్లోనే ముగిసిన ఏకపక్ష పోరులో ఆదినుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సరిగ్గా రెండేండ్ల క్రితం తనకెదురైన పరాజయానికి ఒకుహరపై దీటైన ప్రతీకారం తీర్చుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -