Friday, May 10, 2024
- Advertisement -

బీసీసీఐ వెబ్‌సైట్ నిలిచిపోవ‌డంతో షాక్‌కు గుర‌యిన క్రికెట్ అభిమానులు…

- Advertisement -

ప్రపంచంలోనే ధనిక బోర్డు అయిన బీసీసీఐ వెబ్‌సైట్‌ తాత్కాలికంగా ఆగిపోయింది. ఆదివారం 12 గంటలు పైగా ఈ సైట్‌ పని చేయలేదు. ఏ దేశ క్రికెట్‌ బోర్డు ఆర్జించని రాబడి బీసీసీఐ సొంతం. అయితే భారీ రాబడి కల్గిన బీసీసీఐకి చెందిన వెబ్‌సైట్‌ కార్యకలాపాలు తాజాగా నిలిచిపోవడం క్రికెట్‌ వరల్డ్‌ను షాక్‌కు గురిచేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీనికి ప్ర‌ధాన కార‌నం బీసీసీఐ టీవీ వెబ్‌సైట్‌ డొమైన్‌ను పునరుద్ధరించుకోవడంలో విఫ‌లం కావ‌డ‌మే.సెంచూరియన్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డే నుంచి బీసీసీఐ వెబ్‌సైట్‌ పనిచేయడం లేదు. బ్రౌజర్‌లో వెబ్‌సైడ్‌ అడ్రస్‌ కొట్టిన ప్రతిసారీ వెబ్‌సైట్‌ రిజిస్ట్రార్‌ అయిన రిజిస్ట్రార్‌. కామ్‌ లేదా నేమ్‌జీత్‌. కామ్‌ వెబ్‌సైట్లకు రీ డైరెక్ట్‌ అవుతోంది.

బీసీసీఐ వెబ్‌సైట్‌డొమైన్‌ 2-2-2006 నుంచి 2-2-2019 వరకు మాత్రమే పనిచేస్తుంది. 2018, ఫిబ్రవరి 3న ఈ డొమైన్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. ఇది జరగకపోవడంతో వెబ్‌సైట్‌ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దాంతో భారత్‌, దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్‌ ట్విటర్‌లో అప్‌డేట్స్ ఇచ్చిన ప్రతిసారీ వెబ్‌సైట్‌ లింక్‌ను ఇచ్చారు. కాగా, పనిచేయకపోవడంతో వేలమంది అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ క‍్రమంలోనే రిజిస్ట్రార్‌. కామ్‌ కు వెళ్లిన కొంతమంది బీసీసీఐ వెబ్‌సైట్‌ను కొనుగోలు చేసేందుకు సరదాగా 7 బిడ్డింగులు వేశారు. ఇందులో ఒకరు అత్యధికంగా 270 డాలర్లకు బిడ్‌ వేశారు.

ఈ సైట్‌ ఐపీఎల్‌ మాజీ కమిషనర్‌ లలిత్‌ మోదీకి చెందిన మోదీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట ఉంది. డొమైన్‌ పునరుద్ధరణను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొన్ని గంటల పాటు ఇది వేలానికి కూడా వెళ్లింది. వెంటనే తేరుకున్న బీసీసీఐ డొమైన్‌ను పునరుద్ధరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -