Thursday, May 2, 2024
- Advertisement -

రిటైర్మెంట్ వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించిన ధోని…

- Advertisement -

బ్రిటన్ లో జరుగుతున్న వరల్డ్ కప్ పోటీలే తమకు చివరి పోటీలని పలువురు ఆటగాళ్లు ఇప్పటికే రిటైర్ మెంట్ ప్రకటించారు. పంచకప్‌ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ అయినా ఆడాలని ఆశించి భంగపడ్డ హైదరాబాద్‌ స్టార్‌ ఆటగాడు, భారత మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ అంబటి రాయుడు తన కెరీర్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అలాగే పాక్‌ సీనియర్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌, దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్ . విండీస్ ఆట‌గాడు గేల్ కూడా లు కూడా ఆటకు గుడ్‌బై చెప్పారు.

ఇక మ‌హేంద్ర సింగ్ ధోనికి కూడా ఇదే చివ‌రి ప్ర‌పంచ క‌ప్ అని త‌ర్వాత రిటైర్మెంట్ అవుతున్నార‌నె వార్త‌లు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. అయితే రిటైర్మెంట్ వ్యాఖ్య‌ల‌పై ధోని ఘాటుగా స్పందించారు. వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ అనంతరం, రిటైర్ మెంట్ చెబుతానని వస్తున్న వార్తలు గాలి వార్తలేనని స్పష్టం చేశాడు. ఏబీపీ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తన వీడ్కోలు గురించి తనకే తెలియదని పేర్కొన్నాడు. తానెప్పుడు రిటైర్‌ అవుతానో చెప్పలేనని, కానీ చాలా మంది తాను శ్రీలంకతో మ్యాచ్ కి ముందే రిటైర్ మెంట్ ప్రకటించాలని కోరుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచకప్‌ తర్వాతా కూడా ధోని తన ఆటను కొనసాగిస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పుడే చాలా కష్టమైందని తెలిపారు. ఇక టీమ్‌మేనేజ్‌ మెంట్‌ ధోనికి మద్దతుగా ఉంది. ఇక కెప్టెన్ విరాట్‌, కోచ్ ర‌విశాస్త్రిలు కూడా మొద‌టి నుంచి ధోనికి మ‌ద్ద‌తుగా ఉన్న విష‌యం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -