Sunday, April 28, 2024
- Advertisement -

ఐపీఎల్‌ 10లో… ఆటోడ్రైవర్‌ కొడుకు.. 2.6 కోట్లకు అమ్ముడు పోయాడు

- Advertisement -
Hyderabad Cricketer Mahmadh Siraj Got Whopping Price of rs 2.60 Crores in IPL 10

మంచి సక్సె అయిన ఐపీఎల్‌.. ఇప్పుడు ఐపీఎల్‌ 10వ సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అందుకోసం తాజాగా ఆటగాళ్ల వేలం పాట నిర్వహించారు. ప్రముఖ ఆటగాళ్లు కోట్ల రూపాయల ధర పలికారు. ఇక ఇక్కడ ఆటగాళ్లకు కూడా కోట్లు కుమ్మరించి మరీ కొనుగోలు చేయడం జరిగింది. ఇక హైదరాబాద్ కు చెందిన మహ్మద్‌ సిరాజ్‌ అనే కుర్రాడిని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు యాజమాన్యం ఏకంగా 2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఆశ్చర్యకర సంగతి ఏంటంటే మహ్మద్‌ సిరాజ్‌ తండ్రి ఒక ఆటో డ్రైవర్‌.

చాలా కష్టాలు పడి ఆ తండ్రి తన కొడుకు ఇష్టమైన క్రికెట్‌ ఆటను నేర్పించాడు. తండ్రి పడ్డ కష్టంకు.. మహ్మద్‌ సిరాజ్‌ బాగా కష్టపడి హైదరాబాద్‌ రంజీ జట్టులో చాన్స్ సంపాధించాడు. చాన్స్ అనేది చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడు వినియోగించుకోకుంటే మళ్లీ అలాంటి అవకాశం వస్తుందో రాదో చెప్పలేము. అందుకే వచ్చిన చాన్స్ ను సిరాజ్‌ దక్కించుకున్నాడు. రంజిల్లో మంచి ప్రతిభ కనబర్చాడు. ఒక మ్యాచ్‌లో కేవలం 20 పరుగులు ఇచ్చి ఏకంగా 9 వికెట్లు తీశాడు.

ఇంకా పలు మ్యాచ్‌లలో బౌలింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. దాంతో సిరాజ్‌కు ఐపీఎల్‌ వేలంలో అదృష్టం కలిసి వచ్చింది. మొదట ఐపీఎల్‌ సిరాజ్‌ రేటును 20 లక్షలుగా నిర్ణయించారు. అయితే సిరాజ్‌ ట్రాక్‌ రికార్డును చూసిన ప్రాంచైజీలు పోటీ పడి మరీ పాట పాడి సిరాజ్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నించారు. చివరకు సన్‌రైజర్స్‌ వారు సిరాజ్‌ను 2.6 కోట్లకు దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో అవకాశం రావడం పట్ల సంతోషంగా ఉన్నానని, తప్పకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటూ సిరాజ్‌ చెబుతున్నాడు. తన కొడుకు ఐపీఎల్‌లో ఆడబోతుండటంతో తనకు ఇన్నాళ్లు పడ్డ కష్టం అంతా మర్చి పోయినట్లయ్యిందని సిరాజ్‌ తండ్రి చెప్పుకొచ్చాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -