Thursday, May 2, 2024
- Advertisement -

16 ఏళ్లు రికార్డును తిర‌గ‌రాసిన కోహ్లీ….

- Advertisement -

ఆస్ట్రేలియా గడ్డపై నిలకడగా ఆడుతున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మరో మైలురాయిని అధిగమించాడు . గతంలో నమోదైన ఒక్కో రికార్డునూ తన పేరిట లిఖించుకుంటూ సాగుతున్న భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో 16 ఏళ్ల నాటి మరో రికార్డును బద్ధలు కొట్టాడు. 2002లో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ 1,137 పరుగులతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పగా.. తాజాగా విరాట్ కోహ్లీ 1,138 పరుగులతో ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.

దే సమయంలో మరో వ్యక్తిగత రికార్డును కూడా కోహ్లీ నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులను ఆస్ట్రేలియాపై (1573 పరుగులు) సాధించాడు. కోహ్లీ ఇంగ్లండ్ పై 1570, శ్రీలంకపై 1005 పరుగులు చేసి ఉన్నాడు. కాగా, ఈ మ్యాచ్ లో కోహ్లీ 82 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవీలియన్ చేరిన సంగతి తెలిసిందే. ద్రవిడ్ అప్పట్లో కేవలం 18 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకోగా.. కోహ్లీ మాత్రం 21 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డ్‌ని చేరుకోవడం విశేషం.

2002లో విదేశీ గడ్డపై పరుగుల వరద పారించిన రాహుల్ ద్రవిడ్.. 66.88 సగటుతో ఏకంగా 4 శతకాలు, 4 అర్ధశతకాలతో మెరిశాడు. ఆ ఏడాది విదేశాల్లో 11 టెస్టులాడిన ద్రవిడ్ 18 ఇన్నింగ్స్‌ల్లో 1,137 పరుగులు చేశాడు. మరోవైపు ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా, ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటనలో శతకాల మోత మోగించిన విరాట్ కోహ్లీ.. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపైనా అదే జోరుని కొనసాగిస్తున్నాడు. మెల్‌బోర్న్ టెస్ట్ రెండో రోజు మిషెల్ స్టార్క్ బౌలింగ్‌లో పర్‌ఫెక్ట్ టైమింగ్‌తో ఆన్ సైడ్ డ్రైవ్ షాట్ కొట్టి అలరించాడు. ఈ షాట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -