Friday, April 26, 2024
- Advertisement -

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. కోహ్లి చెత్త రికార్డు!

- Advertisement -

చెన్నైలో టీమిండియా- ఇంగ్లండ్ మ‌ధ్య రెండో టెస్టు శ‌నివారం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ‌టాస్ గెలిచిన భార‌త్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్‌ రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ(161) చేయ‌గా.. వైస్ కెప్టెన్ అజింక్య ర‌హానే అర్ధ సెంచ‌రీ(66) చేశాడు. శుభ్‌మ‌న్ గిల్‌, కెప్టెన్ విరాట్ కోహ్లి డ‌కౌట్ అయ్యారు. పుజారా, అశ్విన్ కూడా అవుట్ అయ్యారు. దీంతో మొద‌టి రోజు ఆట ముగిసే స‌రికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. పంత్‌, అక్ష‌ర్ ప‌టేల్ బ్యాటింగ్ చేస్తున్నారు.

ఇక తొలి టెస్టులో ఓట‌మితో కెప్టెన్‌గా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న కోహ్లి.. ఈ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డు న‌మోదు చేశాడు. ఇంగ్లిష్ స్పిన్న‌ర్ మొయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్్డ అయిన అత‌డు..టెస్టు కెరీర్‌లో 11వ సారి డకౌట్‌గా పెవిలియ‌న్ చేరాడు. అది కూడా స్పిన్న‌ర్ బౌలింగ్‌లో ఇలా వెనుదిరగ‌డం ఇదే తొలిసారి. అంత‌కుముందు ఫాస్్ట బౌల‌ర్ల చేతిలోనే ఇలా అవుట‌య్యాడు.

దీంతో అటు కోహ్లిని ఇలా పెవిలియ‌న్‌కు పంపిన తొలి స్పిన్న‌ర్గా అలీ కూడా రికార్డుకెక్కాడు. ఇక ఇంట‌ర్నేష‌న‌ల్‌ కెరీర్‌లో కోహ్లి మొత్తం 26 డకౌట్ అయ్యాడు. భార‌త జ‌ట్టు సార‌థిగా ఉంటూ.. ఎక్కువ‌సార్లు డకౌట్‌ అయిన రెండో క్రికెట‌ర్‌గా కూడా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో డకౌట్‌తో కోహ్లి కెప్టెన్ కూల్ ధోనిని దాటేయ‌గా.. సౌరవ్‌ గంగూలీ(13 డకౌట్లు) ప్ర‌థ‌మ స్థానంలో ఉన్నాడు.

నువ్వా..? నేనా ? అంటూ పోటిప‌డుతున్న మ‌హేష్ బాబు, ప్ర‌భాస్

వేడి నీటితో ఎన్నో ప్ర‌యోజ‌నాలు !

డ‌యాబెసిట్ ముందస్తు ల‌క్ష‌ణాలు ఇవిగో ..!

ఘాటైన మిరియాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -