Friday, May 10, 2024
- Advertisement -

టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ‌.. తొలి టెస్టుకు దూరమైన ధావన్…

- Advertisement -

దక్షిణాఫ్రికా గడ్డ మీద జనవరి 5 నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు కేప్‌టౌన్ చేర‌కుంది. అయితే భార‌త జ‌ట్టుకు ఆదిలోనే పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ ఓపెనర్ చీలమండల గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు సమచారం.

సఫారీ గడ్డ మీద సిరీస్ విజయం సాధించాలంటే.. ఓపెనర్లది కీలక పాత్ర. ధావన్‌కు గాయం కావడంతో కేఎల్ రాహుల్, మురళీ విజయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం భారత్‌లోనే ధావన్ గాయపడగా.. జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్ గాయాన్ని పరిశీలించాడు. గాయం తీవ్రతను తెలుసుకోవడం కోసం ఎంఆర్ఐ స్కాన్ కూడా తీశారు. ఫిజియో ఇంకా నివేదిక ఇవ్వాల్సి ఉంది. శిఖర్ దక్షిణాఫ్రికా వెళ్తున్నాడని బీసీసీఐ ట్వీట్ చేసింది.

కాలి గాయంతోనే ధావన్ దక్షిణాఫ్రికాకు వెళ్లాడు. అయితే, ఈ గాయం నుంచి ధావన్ పూర్తిగా కోలుకోనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, ధావన్ ను తొలి టెస్టుకు దూరంగా ఉంచుతున్నట్టు టీమ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. జనవరి 5 నుంచి భారత్-దక్షిణాఫ్రిల మధ్య తొలి టెస్టు జరగనుంది. కేప్ టౌన్ ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ధావన్ కాలి గాయం నేపథ్యంలో, ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు బరిలోకి దిగనున్నారు. మరోవైపు, టెస్టుకు ధావన్ దూరం కావడం పట్ల కెప్టెన్ కోహ్లీ కూడా అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -