Tuesday, April 30, 2024
- Advertisement -

ఎదురులేని భారత స్టార్‌ బాక్సర్‌..

- Advertisement -
  • బాక్సింగ్‌లో దూసుకెళ్తున్న విజయేందర్‌

ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ విజేందర్‌సింగ్ దూసుకెళ్తున్నాడు. త‌న జైత్రయాత్రను కొన‌సాగిస్తున్నాడు. ప్రొ కెరీర్‌లో అజేయ రికార్డును నిలబెట్టుకుంటూ తన పదో విజ‌యాన్ని తాజాగా పొందాడు. శనివారం (డిసెంబ‌ర్ 23) రాత్రి ఆఫ్రికా ఛాంపియన్‌ ఎర్నెస్ట్‌ అముజుతో త‌ల‌ప‌డి విజేందర్ ఘన విజయం సాధించాడు. రిఫరీలు ఏకగ్రీవంగా విజేందర్‌ను విజేతగా ప్రకటించారు. ఈ విజయంతో విజేందర్‌కు డబ్ల్యూబీఓ ఒరియెంటల్‌, ఆసియా పసిఫిక్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిళ్లు రెండూ విజేంద‌ర్‌కు దక్కాయి.

సవాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో జరిగిన బౌట్‌లో ఆరంభంలో విజేందర్‌ కొంత తడబడ్డా.. చివకు విజేందర్‌ ఆధిపత్యం కొన‌సాగించి టైటిల్‌తో బ‌య‌ట‌కు వ‌చ్చాడు. విజేంద‌ర్‌ను ఓడిస్తా.. టైటిళ్లు రెండూ నాకే అని పోటీకి ముందు రెచ్చ‌గొట్టి అతి విశ్వాసంతో ప్ర‌త్య‌ర్థి అముజు ప్ర‌ద‌ర్శించాడు. విజేంద‌ర్ మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో చూపించాడు. బాక్సింగ్‌లో అతడిని కోలుకోనివ్వకుండా చేశాడు. చివర్‌లో అముజు దవడ మీద విజేందర్‌ ఇచ్చిన పంచ్‌తో అతడికి గాయమైంది. సాంకేతికంగా కూడా అముజు తప్పులు కూడా అత‌డి ఓట‌మికి కార‌ణ‌మైంది. వీట‌న్నిటి నేప‌థ్యంలో విజేతగా విజేంద‌ర్‌ను రిఫ‌రీలు ప్రకటించారు. విజేంద‌ర్ మొత్తం 25 బౌట్లలో తలపడితే.. 21 నాకౌట్లు సహా 23 విజయాలు సాధించారు. విజేందర్‌ గెలిచిన 10 బౌట్లలో ఏడు నాకౌట్లు కాగా.. మిగతా మూడు బౌట్లను పూర్తిగా ఆడి విజయం సాధించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -