Sunday, April 28, 2024
- Advertisement -

27 ఏళ్లకే టెస్టుల‌కు గుడ్‌బై చెప్పిన పాక్ స్టార్ బౌల‌ర్‌…

- Advertisement -

పాకిస్థాన్ పేస‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అమీర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. టెస్ట్ మ్యాచ్‌ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించి ప‌రిమిత ఓవ‌ర్ల ఫార్మెట్‌కు మాత్ర‌మే ఆడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ప్రధానంగా వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో అందుకు ఇప్పట్నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలనే ఆలోచ‌న‌తోనె టెస్ట్‌ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. రాబోవు పరిమిత ఓవర్ల సిరీస్‌లను నేను చాలెంజ్‌గా తీసుకుంటున్నా. కేవలం వైట్‌ బాల్‌ క్రికెట్‌పైనే ఫోకస్‌ చేయాలనుకుంటున్నా’ అని ఆమిర్‌ తెలిపాడు.

ఆమిర్‌ 17 ఏళ్ల వయసులోనె 2009 లో శ్రీల‌కంతో జ‌రిగిన టెస్ట్‌లోకి రంగ ప్రవేశం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 36 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆమిర్‌ 119 వికెట్లు సాధించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకొని ఐదేళ్ల‌పాటు నిషేధం ఎదుర్కొన్నారు. అనంత‌రం 2016లో పునరాగమనం చేశాడు.

2016 నుంచి ఇప్పటివరకూ 22 టెస్టులు ఆడిన ఆమిర్‌ 68 టెస్టు వికెట్లు సాధించాడు. జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా ఒక ఇన్నింగ్స్‌లో ఆమిర్‌ 44 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -