Sunday, April 28, 2024
- Advertisement -

ఇంగ్లాండ్ 145 ఆలౌట్..టీమిండియా టార్గెట్ 192

- Advertisement -

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే 5 టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో లీడ్‌లో ఉన్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది.

తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు తీయగా కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. ఓపెనర్ క్రావ్‌లీ 60 పరుగులు చేయగా బెయిర్ స్టో 30,ఫోక్స్ 17 పరుగులు చేశారు. దీంతో భారత్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 219/7తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మరో 88 పరుగులు జోడించి 307 పరుగులకు ఆలౌట్ అయింది.
యువ ఆట‌గాడు ధ్రువ్ జురెల్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ధ్రువ్ జురెల్ 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లతో 90 పరుగులు చేసి ఔటయ్యాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -