Thursday, May 2, 2024
- Advertisement -

పృథ్వీ షా క‌న్నా రిషబ్ పంత్ ఆట బాగుంది – గంగూలీ

- Advertisement -

వెస్టిండీస్‌తో ముగిసిన టెస్ట్ సిరీస్‌లో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, పృథ్వీ షాలు మెరుపు ఇన్నింగ్స్ తో సంచలనాలు సృష్టించారు. అరంగేట్రం సిరీస్ లోనే అదరగొట్టేశారు. ఇంగ్లాండ్‌పై అరంగేట్రం సిరీస్‌లోనే సెంచరీ బాది 21ఏళ్ల వికెట్ కీపర్ రిషబ్ పంత్ వెలుగులోకిరాగా.. ఆదివారం వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో శతకంతో పాటు టాప్ స్కోరర్‌గా నిలిచి 18 ఏళ్ల పృథ్వీ షా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఈ ఇద్దరిలో మ్యాచ్‌ని మలుపు తిప్పే సామర్థ్యం ఎవరికి ఉంది..? అని ప్రశ్నించగా.. గంగూలీ వికెట్ కీపర్ పంత్‌కే ఓటు వేశాడు.

‘రిషబ్ పంత్ క్రీజులో చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు. అతని ఆట కూడా సహజసిద్ధంగా ఉంటుంది. అన్ని ఫార్మాట్లలోనూ మ్యాచ్‌ని మలుపు తిప్పగలిగే సామర్థ్యం అతనికి ఉంది’ అని గంగూలీ ప్రశంసించాడు. వెస్టిండీస్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 84 బంతుల్లో 8×4, 4×6 92 పరుగులు చేసిన రిషబ్ పంత్.. ఉప్పల్‌లో ముగిసిన రెండో టెస్టులోనూ 134 బంతుల్లో 11×4, 2×6 సాయంతో సరిగ్గా 92 పరుగుల వద్దే ఔటయ్యాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -