Friday, May 3, 2024
- Advertisement -

2019 ప్రపంచకప్ జట్టులో ధోనీ ఉంటాడని తెలిసిన తర్వాత ఎందుకు ప్ర‌శ్నిస్తారు…? రోహిత్ శ‌ర్మ‌..

- Advertisement -

ప‌రిమిత ఓవ‌ర్ల జ‌ట్టునుంచి ధోనీ త‌ప్పుకోవాల‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. క్రికెట్ నుంచి త‌ప్పుకొని యువ క్రికెట‌ర్ల‌కు అవ‌కాశాలు ఇవ్వాల‌ని మీజీ క్రికెట‌ర్లు విమ‌ర్శ‌లు చేశారు. ధోనీకీ మ‌ద్ద‌తుగా కోచ్ ర‌విశాస్త్రి ఇత‌ర ఆట‌గాల్లు మాట్లాడారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వూలో రోహిత్ శ‌ర్మ స్పందించారు.

భారత పరిమిత ఓవర్ల జట్టుకి మహేంద్రసింగ్ ధోనీని ఎంపిక చేస్తుండంపై ఓ ఇంటర్వ్యూలో వచ్చిన ప్రశ్నకి ఓపెనర్ రోహిత్ శర్మ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మళ్లీ.. మళ్లీ ఈ తరహాలో ధోనీ ఆటతీరు, కెరీర్‌ గురించి తనని ప్రశ్నించొద్దంటూ ఆస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇటీవల శ్రీలంకతో ముగిసిన వన్డే, టీ20 సిరీస్‌ల్లో వికెట్‌ కీపర్‌గా అత్యుత్తమ స్థాయిలో రాణించిన ధోనీ.. బ్యాట్‌తోనూ మెరుపులు మెరిపించాడు. దీంతో 2019 ప్రపంచకప్‌ జట్టులో ధోనీకి చోటు ఖాయమంటూ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గత వారం ప్రకటించేశారు.

ఇటీవల కాలంలో వన్డే, టీ20ల్లో ధోనీ మెరుగ్గా రాణిస్తున్నా.. అతని రిటైర్మెంట్, జట్టులో స్థానంపై ప్రశ్నలు రావడం నన్ను షాక్‌కి గురిచేస్తున్నాయి. ధోనీ తాజా ప్రదర్శన చూసిన తర్వాత కూడా ప్రజలు ఎందుకు అతని కెరీర్‌ గురించి మాట్లాడుతున్నారో..? అర్థం కావడం లేద‌న్నారు. 2019 ప్రపంచకప్ జట్టులో అతను ఉంటాడని తెలిసిన తర్వాత కూడా ఇలా మాట్లాడటం సబబు కాద‌న్నారు.

భారత వన్డే జట్టులో అతను కీలక ఆటగాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో 6వ స్థానంలో వస్తుండటంతో ధోనీకి ఎక్కువ బంతులు ఆడే అవకాశం దక్కడం లేదు. కాబట్టి అతని భారీ స్కోర్లు మీకు కనిపించడం లేదు’ అని రోహిత్ వివరించాడు. ఇక‌ ధోనీ ఫిట్‌నెస్‌పై విమ‌ర్శ‌ల‌కు తావుండ‌దు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -