Sunday, April 28, 2024
- Advertisement -

ఆ ఒక్క ప‌నే ధోనిని హీరో చేసింది

- Advertisement -

ఇండియ‌న్ క్రికెట్‌లో ధోని పేరు సంచ‌ల‌న‌మే అని చెప్పాలి.అయితే ధోనిని మాత్రం ఇండియ‌న్ క్రికెట్‌లోకి తీసుకువ‌చ్చింది మాత్రం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ.జార్ఖండ్‌ డైనమైట్‌ వెలుగులోకి వచ్చింది గంగూలీ సారథ్యంలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అత‌ని సార‌థ్యంలోనే ధోని క్రికెట్‌లో మెళుకువ‌లు నేర్చుకున్నాడు.దీనిపై గంగూలీ స్పందిస్తు..ధోని 2004లో జట్టులోకి వచ్చాడు. అతని ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో 7 స్థానంలోనే బ్యాటింగ్‌కు చేశాడు.

అయితే పాకిస్తాన్‌తో వైజాగ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కూడా అతను 7వ స్థానంలోనే బ్యాటింగ్‌ చేయాలని ముందురోజు నిశ్చయించుకున్నాం. ఆ సమయంలో నేను నా గదిలో కూర్చోని న్యూస్‌ చూస్తున్నాను. ధోనిని మంచి ఆటగాడిగా ఎలా మార్చాలని ఆలోచించాను. అతని సత్తా ఏంటో నాకు తెలుసు. మరుసటి రోజు మ్యాచ్‌లో టాస్‌ నెగ్గాం. వెంటనే అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్‌ పంపించాలని డిసైడయ్యాను.ఈ ఒక్క నిర్ణయమే భారత్‌కు ఓ గొప్ప కెప్టెన్‌ అందించడమే కాకుండా ఐసీసీ టైటిళ్లన్నీ నెగ్గేలా చేసింది. ఇక ఆ మ్యాచ్‌లో ధోని శతకంతో విశ్వరూపం చూపిన విషయం తెలిసిందే.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -