Friday, May 3, 2024
- Advertisement -

వార్నర్‌ మెరుపు ఇన్నింగ్స్ పంజాబ్‌పై హైద‌రాబాద్ ఘ‌న‌విజ‌యం….

- Advertisement -

వరుసగా రెండు ఓటములతో ప్లేఆఫ్‌ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న సన్‌రైజర్స్‌ మళ్లీ పుంజుకుంది. పంజాబ్‌పై ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో ప్లేఆఫ్ ఆశ‌ల్ని స‌జీవంగా ఉంచుకోగా…పంజాబ్ మాత్రం మ‌రింత సంక్లిష్టం చేసుకుంది. ఎస్ఆర్ హెచ్‌ను ప్లే ఆఫ్ రేసులో నిలిపిన వార్న‌ర్ ఐపీఎల్ 2019 సీజన్‌కి గుడ్‌బాయ్ చెప్పారు. మే తొలి వారంలోనే స్వదేశానికి వచ్చేయాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేయడంతో.. సోమవారం రాత్రి ఉప్పల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై చివరి మ్యాచ్ ఆడేసిన వార్నర్.. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో టీమ్‌ని గెలిపించి మరీ వీడ్కోలు పలికాడు.

రెండు వరుస పరాజయాలకు బ్రేక్‌ వేస్తూ సొంతగడ్డపై ఆడిన ఆఖరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిచింది. డేవిడ్ వార్న‌ర్ మెరుపు ఇన్నీగ్స్‌తో సోమవారం జరిగిన కీలకమైన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 45 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగుల భారీస్కోరు చేసింది. వార్నర్‌ (56 బంతుల్లో 81; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది. లోకేశ్‌ రాహుల్‌ (56 బంతుల్లో 79; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు.రషీద్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్‌ చెరో 3 వికెట్లు తీశారు. వార్నర్‌ కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -