Friday, May 10, 2024
- Advertisement -

డేవిడ్ వార్న‌ర్‌కు షాక్‌…సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న వార్న‌ర్‌..

- Advertisement -

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ నుంచి డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు. అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సన్ రైజర్స్ సీఈవో కె.షణ్ముగం ప్రకటించారు. ఓపెనర్ శిఖర్ ధావన్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, బంగ్లా ఆటగాడు షకీబుల్ హసన్‌లలో ఒకరికి కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆసీస్‌ క్రికెట్‌లో తాజాగా చోటు చేసుకున్న బాల్‌టాంపరింగ్‌ వివాదం కారణంగా డేవిడ్‌ వార్నర్‌ స్వతహాగా సన్‌రైజర్స్‌ హైదాబాద్‌ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. 2016లో జట్టుకు టైటిల్ అందించిన వార్నర్‌పై చర్యలు తీసుకునే విషయంలో సన్‌రైజర్స్ ఆచితూచి వ్యవహరించింది. క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు ప్రకటించే దాకా అతడిపై ఎలాంటి చర్య తీసుకోబోమని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చింది.

బాల్ ట్యాంపరింగ్ వివాదం కారణంగా వార్నర్ ఆస్ట్రేలియా జట్టు వైస్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సదర్‌ల్యాండ్ ఆదేశాల మేరకు బుధవారమే స్మిత్, బాన్‌క్రాఫ్ట్‌లతో కలిసి వార్నర్ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి పయనం అవుతున్నాడు.

ఇప్ప‌టికే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు కెప్టీన్సీనుంచి త‌ప్పుకున్నారు. ఇప్పుడు స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు కెప్టెన్సీనుంచి వార్న‌ర్ త‌ప్పుకున్నారు. స‌న్‌రైజ‌ర్స్ కెప్టెన్సీ రేసులో ప్రధానంగా శిఖర్‌ధావన్‌ పేరు వినిపిస్తున్నట్లు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -