Saturday, April 27, 2024
- Advertisement -

అంచనాలు తారుమారు, భారత్ ఘోర పరాజయం…

- Advertisement -

టీమిండియా అంచనాలు తారుమారయ్యాయి. గెలుపు మాట అటుంచితే చెన్నైలో జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన మ్యాచ్ ని కనీసం డ్రా కూడా చేసుకోలేకపోయింది. 39/1 తో చివరి రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియా కీలక బ్యాట్స్ మెన్ వైఫల్యంతో 227 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (72), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.

వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే, వాషింగ్టన్‌ సుందర్‌, షాబాజ్‌ నదీం డకౌట్‌గా వెనుదిరిగారు. తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులతో రాణించిన పంత్‌ సైతం రెండో ఇన్నింగ్స్ లో 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. చతేశ్వర్‌ పుజారా 15 పరుగులకే అవుట్ కావడంతో భారత్ పుంజుకునే పరిస్థితి లేకపోయింది. భారీ టార్గెట్ ను ఛేదించాల్సిన క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ 4, ఆండర్సన్‌ 3 వికెట్లు తీయగా.. స్టోక్స్‌, జోఫ్రా ఆర్చర్‌, డామ్‌ బెస్‌లకు తలో వికెట్‌ దక్కింది.

ఇక ఆస్ట్రేలియాలో చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయంతో జోరు మీదున్న టీమిండియాకు భారీ షాకిచ్చిన ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఫిబ్రవరి 13న రెండో టెస్టు జరగనుంది. మ్యాచ్ మొత్తం స్కోరు వివరాలు చూస్తే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 578 ఆలౌట్‌, టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ 337 ఆలౌట్‌, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 178 ఆలౌట్‌, టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ 192 ఆలౌట్‌.

Also Read

వ‌హ్వా అశ్విన్‌.. 114 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొట్టాడు

భ‌ళా వాషింగ్ట‌న్ సుంద‌ర్‌.. న‌మ్మ‌కం నిల‌బెట్టుకున్నావు!

పాపం ఈ అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ దానిపైనే..

పూజా హెగ్డే తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -