Friday, May 10, 2024
- Advertisement -

కొహ్లి… కొహ్లి… కొహ్లి

- Advertisement -

ఐపిఎల్ ముగిసింది. బెంగళూరు ఓడింది. అయితే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కొహ్లి మాత్రం అటు అభిమానులు, ఇటు క్రికెట్ పండితుల మనసు దోచుకున్నాడు. ఏకంగా మూడు అవార్డులు సొంతం చేసుకుని చిట్టి పొట్టి క్రికెట్ లో తనదైన ప్రతిభను చూపించాడు.

ఆదివారం నాడు ముగిసిన ఐపిఎల్ టోర్నమెంట్ లో విరాట్ కొహ్లి బ్యాటింగ్ లో ఏకంగా 973 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నారు. అన్ని మ్యాచ్ ల్లోనూ దాదాపు అర్ధ సెంచరీలు చేసిన కొహ్లి తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నాడు. అలాగే టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక సిక్సర్లు కొట్టింది కూడా విరాట్ కొహ్లి. ఈ టోర్నమెంట్ లో ఏకంగా 38 సిక్సర్లు బాదాడు. అంటే విరాట్ తన మొత్తం స్కోర్ 973 పరుగుల్లో 228 పరుగులు సిక్సర్ల రూపంలో వచ్చినవే. ఇక టోర్నమెంట్ మొత్తంలో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ గా కూడా విరాట్ కొహ్లి ఎంపికయ్యాడు. దీంతో ఫైనల్ లో ఓటమి పాలైనా విరాట్ కొహ్లి మాత్రం మూడు అవార్డులతో తన ప్రతిభను చాటుకున్నాడు.

ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నమెంట్ లో 23 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ బౌలర్లలో అందరికంటే ముందున్నాడు. ఇక పేయర్ ప్లే అవార్డును సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఇక ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ ఎంపికయ్యాడు. ఈ టోర్నమెంట్ లో ముస్తాఫిజుర్ 17 వికెట్లు తీసాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -