మునుపటి విరాట్‌ను చూడబోతున్నాం

- Advertisement -

బీసీసీఐ విరాట్‌ కొహ్లీకి షాక్‌ ఇచ్చింది. వద్దంటే టీ20 కెప్టెన్సీని వదిళిలేసిన విరాట్‌కు బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇద్దరు కెప్టెన్లు ఉండకూడదనే ఉద్దేశంతోనే విరాట్‌ను కేప్టెన్సీ నుంచి తొలగించినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

బీసీసీఐ నిర్ణయంతో క్రికెట్‌ ఫ్యాన్స్, విరాట్‌ ఫ్యాన్స్‌ బీసీసీఐపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కొహ్లీని కెప్టేన్సీ నుంచి తొలగించి బీసీసీఐ తప్పు చేసిందని, రానున్న రోజుల్లో భారత క్రికెట్‌ పరిస్థితి దిగజారిపోతుందని మండిపడ్డారు.ఈ పరిస్థితుల్లో భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ బీసీసీఐకి మద్దతు తెలిపారు. వన్డే కేప్టెన్సీ మార్పుపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయం సరైందే అన్నారు.

వచ్చే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ కెప్టెన్సీ మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. వైట్‌ బాల్‌కు రెడ్‌ బాల్‌ వేర్వేరు కెప్టెన్లు ఉండటం మంచిదన్నారు. కెప్టెన్సీ వల్ల విరాట్‌ కొహ్లీ మునుపటిలా ఆడలేకపోతున్నారని గంభీర్‌ అన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇక నుంచి ఒకప్పటి విరాట్‌ను చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌ వారిపైనే ఎక్కువ..!

ఆ తర్వాత భారత్‌లో తార్డ్‌ వేవ్‌?

పెరుగుతున్న ఒమైక్రాన్‌ కేసులు

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -