Saturday, May 11, 2024
- Advertisement -

త‌న రిటైర్మెంట్‌పై స్పందించిన యువ‌రాజ్‌….

- Advertisement -

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ గతేడాది జులై నుంచి ఏ ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ కనపడలేదు. దీంతో తన రిటైర్మెంట్‌పై మీడియా వేసిన ప్రశ్నలకు యువరాజ్ సింగ్ సమాధానాలు ఇచ్చాడు.. తాను ప్రస్తుతం ఐపీఎల్‌ కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు. ఈ టోర్నీలో బాగా రాణిస్తే 2019 ప్రపంచకప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంటుందని తెలిపాడు.

2019 వరకు తాను క్రికెట్‌ ఆడాలనుకుంటున్నట్లు యువరాజ్‌ సింగ్‌ చెప్పాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయం 2019 ప్రపంచ కప్ తరువాతే ప్రకటిస్తానని తెలిపాడు. తన కెరీర్‌ తొలి 6-7 ఏళ్లు అద్భుతంగా సాగిందని, అనంతరం టెస్టు మ్యాచ్‌లో అవకాశాలు రాలేదని అన్నాడు. సరిగ్గా వాటిల్లో ఆడే అవకాశం వచ్చినప్పుడు కేన్సర్‌ చికిత్స తీసుకుంటున్నానని, ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలీదని అన్నారు.

ఇక దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లి సేన విజయంపై స్పందిస్తూ.. ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన ఇచ్చారని, ముఖ్యంగా విరాట్‌ కెప్టెన్‌గా ముందుండి నడిపించాడని కొనియాడాడు. స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌లు అద్భుతంగా రాణించారని చెప్పుకొచ్చారు. అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన యువ ఆటగాళ్లకు ఐపీఎల్‌ చక్కని వేదికని ఈ సిక్సర్ల సింగ్‌ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -