అల్లు అరవింద్ పై పంచులు వేసిన ‘ఆర్ ఎక్స్ 100’ హీరో

231
RX100 Actor Kartikeya Satire on Allu Arvind
RX100 Actor Kartikeya Satire on Allu Arvind

టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతలలో అల్లు అరవింద్ కూడా ఒకరు. అలాంటిది అల్లు అరవింద్ గురించి మాట్లాడుతూ ఆయనపై పంచులు వేసాడు యువ హీరో కార్తికేయ. తన తదుపరి సినిమా ‘గుణ 369’ సినిమాపై బజ్ పెరగాలని అలా అన్నాడో ఏమో కాని ఆ సినిమా ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్ పై షాకింగ్ కామెంట్ చేసాడు కార్తికేయ. గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘సరైనోడు’ సినిమా లో బోయపాటి వద్ద శిష్యరికం చేసిన అర్జున్ జంధ్యాల ‘గుణ 369’ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ‘గుణ 369’ సినిమా ‘సరైనోడు’ సినిమా పెద్ద హిట్ అవుతుంది అంటూ కామెంట్ చేశాడు కార్తికేయ. అంతలోనే తన తప్పు తెలుసుకుని ఎదో పంచ్ బాగుందని ఇలా అన్నాను అని కవర్ చేశారు. తరువాత గీత ఆర్ట్స్ బోయపాటి తో ఇంకో సినిమా అని అల్లు అరవింద్ చెబుతుండగా, మధ్యలో కలగజేసుకున్న కార్తికేయ ‘అందులో హీరో నేనేనా సార్’ అన్నాడు. అరవింద్ లాంటి పెద్ద నిర్మాత ముందు ఓ యువ హీరో ఇలా చమత్కారాలు ఆడటం ఏమిటా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Loading...