Tuesday, April 30, 2024
- Advertisement -

హీరోల రెమ్యునరేషన్‌పై అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

అగ్ర హీరోలతో సినిమాలంటేనే నిర్మాతలు జంకే పరిస్థితి నెలకొంది. కొద్ది సంవత్సరాల క్రితం మహా అయితే ఎక్కువలో ఎక్కువ అగ్రహీరోలతో సినిమా అంటే రూ. 20 నుండి 30 కోట్లు వరకు ఖర్చు అయ్యేవి. కానీ నేడు టాలీవుడ్ అగ్రహీరోలతో సినిమాలు తీయాలంటే రూ.100 కోట్లు కావాల్సిందే. ఇందులో హీరోల రెమ్యునరేషనే రూ. 50 కోట్లు. దీంతో బడా హీరోలతో సినిమాలు హిట్ అయితే ఓకే ఒకవేళ యావరేజ్ గానీ ఫ్లాప్ గానీ అయితే అంతే సంగతులు.

ఇక హీరోల రెమ్యునరేషన్‌పై కొంతమంది నిర్మాతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ పొడ్యూసర్ అల్లు అరవింద్ హీరోల రెమ్యునరేషన్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. హీరోల రెమ్యునరేషన్‌పై వస్తున్న వార్తలన్ని రూమర్స్ అని చెప్పేశారు. హీరో వల్ల సినిమా బడ్జెట్ పెరగడం లేదని… పాన్ ఇండియా క్రేజ్ వల్ల సినిమా బడ్జెట్ లు పెరుగుతున్నాయని చెప్పేశారు.

సినిమా నిర్మాణం లో హీరో కి మిగిలేది 20 నుంచి 25 శాతం మాత్రమేనని దాని వల్ల సినిమా బడ్జెట్ పెరగదని తేల్చిచెప్పేశారు. కేజీఎఫ్ సినిమా రిలీజ్ కి ముందు ఆ హీరో ఎవరు అనేది కూడా తెలియదు మన జనాలకి, కానీ నిర్మాత మాత్రం కథని నమ్మి సినిమా కి ఖర్చు పెట్టాడు కట్ చేస్తే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పారు. ఇక సెకండ్ పార్ట్‌కి తగిన బడ్జెట్ పెట్టి తీయడం వల్ల హిట్ అయిందని అందుకే హీరో రెమ్యునరేషన్ వల్ల పెరిగిందనే దాంట్లో నిజం లేదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -