Tuesday, March 19, 2024
- Advertisement -

ఎగ్జిట్ పోల్స్ కంటే ముందే లగడపాటి సర్వే….అంద‌రిలోను ఉత్కంఠ‌

- Advertisement -

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ కు గ‌తంలో మంచి పేరుంది. పోలింగ్ ముగిసిన త‌ర్వాత ఆయ‌న విడుద‌ల చేసె ఎగ్జిట్ పోల్స్‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఉండేది. ఎన్నిక‌ల ఫ‌లితాలు, ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్ ఇంచుమించు ఒకే లే ఉండేవి. కాన ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండ‌వు క‌దా. తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్ తారుమారు కావ‌డంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న క్రెడిట్ అంతా పోగొట్టుకున్నాడు.

ఇప్పుడు మ‌రోసారి ఏపీ ఎగ్జిట్ పోల్స్‌ను విడ‌దుల చేసేందుకు రెడీ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎగ్జిల్ పోల్స్ అంచనాలను బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఓ క్లారిటీ వస్తే… ఏపీలో మాత్రం లగడపాటి వెల్లడించబోయే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయో అని నేతలతో పాటు ప్రజలు కా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణాలో మాదిరి కాకుండా ఈసారి ప‌క‌డ్బంధీ వ్యూహంతో ముందుకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.

అయితే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడానికి ఒక రోజు ముందుగానే లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు రావాలని నిర్ణయించుకోవడంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈనెల 19 సాయంత్రం వ‌ర‌కు స‌ర్వే ఫ‌లితాల‌ను వెల్ల‌డించకూడదని ఆంక్షలు ఉన్నాయి . కాని ల‌గ‌డ‌పాటి మాత్రం ఒకరోజు ముందే అంటే 18 సాయంత్రం ప్రెస్మీట్ ఏర్పాటు చెయ్యడంపై జోరుగా చర్చ సాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు వెలగపూడి లోని వీ స్క్వేర్ ఫంక్షన్ హాల్ లో లగడపాటి ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఏపీ ఫ‌లితాల‌తో పాటుగా జాతీయ రాజ‌కీయాల గురించి మే 19న సాయంత్రం ప్రకటిస్తానని లగడపాటి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఒక రోజు ముందుగానె ప్రెస్ మీట్ పెట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

మరోవైపు తెలంగాణలోనూ ఇదే రకంగా పలుసార్లు మీడియా ముందుకు వచ్చిన లగడపాటి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయనే దానిపై సంకేతాలు ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌లో మహాకూటమి గెలుస్తుందని చెప్పిన లగడపాటి రాజగోపాల్… అంతకుముందు మీడియా ముందుకు వచ్చిన సందర్భంలోనూ మహాకూటమికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని ప్ర‌క‌టించారు. కాని ఫ‌లితాలు వ‌చ్చాక ల‌గ‌డ‌పాటి ఎగ్జిట్ పోల్స్ త‌ల‌క్రిందుల‌వ‌డంతో రాజ‌కీయాల్లో జోక‌ర్‌గా మారారు. ఇప్పుడు ఏపీలో కూడా ఖ‌శ్చిత‌మైన ఫ‌లితాలు వెల్ల‌డిస్తారా లేకా తెలంగాణాలో మాదిరి జోక‌ర్ అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -