Wednesday, May 1, 2024
- Advertisement -

పవన్‌కు ఎదురుదెబ్బ..వైసీపీలోకి బొంతు

- Advertisement -

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. రాజోలు నియోజకవర్గ ఇంఛార్జీ బొంతు రాజేశ్వరరావు ఆ పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. బొంతు రాజేశ్వరరావుతో పాటు అమ‌లాపురం ఇంఛార్జ్ రాజబాబు, ముమ్మడివరం ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ, పిఠాపురం ఇంఛార్జ్ శేషు కుమారి, కాకినాడ మాజీ మేయర్ సరోజ వైసీపీలో చేరడంతో తూర్పు గోదావరి జిల్లాలో జనసేన తుడుచుకు పెట్టుకుపోయింది.

బొంతు రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. రాజోలు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండుసార్లు పోటీచేసి ఓడిపోయారు. 2019లో 800 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే అనంతరం జనసేన ఎమ్మెల్యే రాపాక వైసీపీకి మద్దతివ్వగా బొంతు జనసేన గూటికి చేరారు.

చివరి వరకు టికెట్ తనకే వస్తుందని ఆశీంచగా అనూహ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ దేవ వరప్రసాద్‌కు టికెట్ ఇచ్చారు పవన్. దీంతో జనసేనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. బొంతు జనసేనను వీడటం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బెనని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -