Tuesday, April 30, 2024
- Advertisement -

ఆసక్తికరంగా పెనుకొండ పోరు!

- Advertisement -

పెనుకొండ అసెంబ్లీ…టీడీపీకి కంచుకోట. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల రవీంద్ర..పెనుకొండను కంచుకోటగా మార్చుకున్నారు.1994,1999,2004లో ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిటాల…టీడీపీకి పెట్టనికోటగా ఈ నియోజకవర్గాన్ని నిలబెట్టారు. పరిటాల తర్వాత 2009,2014లో టీడీపీ నుండే బీకే పార్థసారథి గెలుపొందగా 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ జెండా ఎగురవేశారు.

ఇక ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచింది పెనుకొండ. ముఖ్యంగా పరిటాల, మద్దెలచెరువు సూరి మధ్య ఫ్యాక్షన్‌ వార్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఈ నియోజకవర్గం ఎప్పుడూ వార్తల్లో నిలిచేది. పెనుకొండ పరిధిలో పరిగి, పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లె ,రొద్దం మండలాలున్నాయి.

ఇక ఈ సారి టీడీపీ నుండి సోమందేపల్లి సవిత పోటీ చేస్తుండగా వైసీపీ తరపున కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ పోటీ చేస్తున్నారు. ఇక పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ అనంతపురం ఎంపీగా పోటీ చేస్తున్నారు. దశాబ్దాలుగా టీడీపీ కంచుకోటగా ఉన్న పెనుకొండను వైసీపీ జగన్ హవాలో దక్కించుకుంది. ఇక ఈ సారి కూడా టీడీపీ, వైసీపీ మధ్య పోరు ఆసక్తికరంగా మారగా టీడీపీ కంచుకోటను ఆ పార్టీ దక్కించుకుంటుందా?, సిట్టింగ్ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకుంటుందా అన్నదానిపై అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -