Tuesday, April 30, 2024
- Advertisement -

విటమిన్ డి లోపిస్తే..మీరు ప్రమాదంలో ఉన్నట్లే?

- Advertisement -

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు,విటిమన్లు, ప్రోటీన్లు చాలా అవసరం. అయితే మారుతున్న జీవనశైలీ కారణంగా పెద్దలే కాదు చిన్న పిల్లల్లోనూ విటమిన్లు లోపించి వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక ప్రధానంగా విటమిన్ డి లోపిస్తే పిల్లల్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది.

విటమిన్ డి…సహజ సిద్దంగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఇ విటమిన్ డి లో డి1, డి2, డి3 అనే రకాలు ఉంటాయి. డి2 మరియు డి3 మనుషులకు అత్యంత అవసరమైన సమ్మేళనం. ఇది శరీరానికి కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందించడంలో ముఖ్య పోషిస్తుంది.

అయితే పిల్లల్లో డి విటమిన్ లోపించడం వల్ల ఎముకల బలహీనతకు కారణమవుతోంది. అలాగే చర్మ సమస్యల బారిన కూడా పడుతున్నారు. చేపలను వారానికి రెండుసార్లు పిల్లలకు తినిపించడం వల్ల విటమిన్ డి లోపం నుండి బయటపడవచ్చు. ప్రతి రోజు రెండు గుడ్లను తినిపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి…పిల్లలకు రోజుకు 1-2 గ్లాసుల పాలు ఇవ్వడం వల్ల వారి పోషకాహారం అందుతుంది.

విటమిన్ డి లోపం కారణంగా జుట్టు రాలే సమస్య తలెత్తుతుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక రుగ్మతలు కూడా దారి చేరే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల సమయంలో, సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలోనూ తప్పనిసరిగా సూర్యరశ్మి శరీరంపై పడేలా చూసుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -