చిరు ఇకనైనా నీ పద్ధతి మార్చుకో..అభిమానుల హెచ్చరిక..!!

1338
fans reaction on chiru movies
fans reaction on chiru movies

మెగా స్టార్ చిరంజీవి తన రీ ఎంట్రీ లో అదిరిపోయే సినిమాలను ప్రేక్షకులకు అందించారు. అభిమానుల తొమ్మిదేళ్ళ నిరీక్షణకు ఖైది నెంబర్ 150, సైరా రూపంలో అయన అభిమానులకు ఫీస్ట్ అంటూ అందించారని చెప్పొచ్చు.. ఇప్పుడు కూడా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తో ఆచార్య సినిమా తో ప్రేక్షకుల ను అలరించడానికి ముస్తబవుతున్నారు.. ఈ సినిమా లో చిరంజేవి క్యారక్టర్ గతంలో ఎ హీరో చేయని విధంగా ఉంటుందని కొరటాల శివ చెప్పడం తో ఈ సినిమా హిట్ అని ఇప్పటినుంచే చెప్తున్నారు అభిమానులు. ఇక మణిశర్మ సంగీతం ఈ సినిమా కి అదనపు ప్లస్ పాయింట్ కాగ చిరంజీవి చాల రోజుల తర్వాత పూర్తి స్థాయి కమర్షియల్  సినిమా లో నటిస్తున్నారు.. 

ఇక చిరంజీవి ఈ సినిమా తర్వాత మలయాళ సినిమా అయినా లూసిఫర్ లో నటిస్తున్నాడని అంటున్నారు.. దీనికి సాహో ఫేం సుజిత్ దర్శకుడు.. ఇక మెహర్ రమేష్ తో ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దర్శకుడు బాబీ తో ఓ సినిమా చేస్తున్నాడు.. ఎంతలేదన్నా సుజిత్ భారీ ఫ్లాప్ సినిమాకు దర్శకుడు.. ఇక మెహర్ రమేష్ సంగతి చెప్పనవసరం లేదు. బాబీ రొటీన్ సినిమాలు చేస్తాడనే పేరుంది.. అయితే ఇతర హీరోల విషయం చూసుకుంటే చిరంజీవి తన నెక్స్ట్ సినిమాల పట్ల ఆయనకున్న పద్ధతి అభిమానులకు రుచించట్లేదట..

బాహుబలి సినిమా తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఓం రౌత్ లాంటి పెద్ద దర్శకుడితో, నాగ అశ్విన్ తో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ తో, ప్రశాంత్ నీల్ లాంటి పాన్ ఇండియా దర్శకుడితో, మహేష్ బాబు చూసుకుంటే పరశురం లాంటి వెరైటీ డైరెక్టర్ తో చేస్తున్నాడు. కానీ చిరు మాత్రం ఆల్రెడీ తెలుగు లో వచ్చిన సినిమాలు, తెలుగు ప్రజలందరూ చూసేసిన సినిమాలు మళ్ళీ చేయడంలో అర్థం లేదని అంటున్నారు.. ఇక ప్రొడక్షన్ హౌస్ పెటు చెప్పి రామ్ చరణ్ ని సినిమాలు తీసుకోనివ్వకుండా తన సినిమాల వెంటే తిప్పుకోవడం అసలు బాలేదట.. RRR తర్వాత రామ్ చరణ్ చేసే సినిమా పై ఇంకా క్లారిటీ లేదట.. దాంతో చిరంజీవి తన సినిమాల మీద వైఖరి మార్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారట..

Loading...