Thursday, May 9, 2024
- Advertisement -

ఉద్దానం కిడ్నీ బాధితులకు వరాలు కురిపించిన సీఎం వైఎస్ జగన్….

- Advertisement -

సీఎం హోదాలో తొలిసారి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.ఉద్దానం ప్రాంత ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు 50 కోట్ల రూపాయలతో పలాసలో నిర్మించనున్న 200 పడకల కిడ్నీ సూపర్‌ స్పెషాలిటీ, రీసెర్చ్‌ ఆసుపత్రికి సీఎం జగన్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు.ఉద్దానం ప్రాంత ప్రజలకు శుద్ధమైన తాగునీటిని అందించేందుకు రూ.600 కోట్లతో నిర్మించనున్నమంచినీటి పథకానికి, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం రూ.11.95 కోట్లతో నిర్మించనున్న జెట్టీ నిర్మాణానికి కూడా పలాసలోనే జగన్‌ శంకుస్థాపన చేశారు.

ప్రస్తుతం స్టేజ్‌ 5లో డయాలసిస్‌ పేషెంట్లకు ఇస్తున్న రూ. 10 వేల పెన్షన్‌ ఇస్తున్నారని అయితే మీ ఎమ్మెల్యే (పలాస శాసన సభ్యుడు) స్టేజ్‌-3 నుంచే బాధితులు భారీ మొత్తంలో మందుల కోసం ఖర్చు చేయాల్సి ఉన్నందున, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని నా దృష్టికి తెచ్చారు. ఆయన సూచన మేరకు స్టేజ్‌-3 నుంచి కూడా బాధితులకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటిస్తున్నా’ అంటూ సభాముఖంగా తెలిపారు.

అదే విధంగా డయాలసిస్‌ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్‌ వర్కర్లను నియమిస్తామని, బాధితులతో పాటు వారికి కూడా ఉచిత బస్సు పాసులు అందజేస్తామని హామీ ఇచ్చారు.జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తిచేసి రైతులకు ప్రయోజనం సత్వరం అందేలా చూస్తామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -