జైలు నుంచి బయటపడొచ్చని కరోనాను అంటించుకున్న ఖైదీలు..!

1327
los angeles inmates tried to get coronavirus
los angeles inmates tried to get coronavirus

కరోనా సోకితే ఎలాగైన జైలు నుంచి బయటకు వెళ్లొచ్చని ప్లాన్ చేసిన కొందరు ఖైదీలు.. కావాలనే వ్యాధిని అందించుకున్న ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలులో జరిగింది. కరోనా సోకితే, అధికారులు విడుదల చేస్తారని తప్పుగా భావించిన ఖైదీలు.. చేసిన పని గురించి సీసీటీవీ ఫుటేజ్ ని జైలు అధికారి అలెక్స్ విల్లా విడుదల చేశారు.

ఈ వీడియోలో.. ఒకరు తాగిన నీరు మరొకరు తాగుతూ.. ఒకరు చీదిన మాస్క్ ను మరోకరు ధరిస్తూ.. ఉద్దేశపూర్వకంగా వైరస్ ను అంటించుకున్నారు. దాంతో రెండు వారాల వ్యవధిలో 30 మంది ఖైదీలకు కరోనా సోకింది. ఇక వీరిని విడుదల చేయని అధికారులు, వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వీరిపై ఉద్దేశపూర్వకంగా వ్యాధిని వ్యాపించేలా చేసినందుకు కేసులు పెట్టామని తెలిపారు.

కాగా అమెరికాలోని జైళ్లలో ఇప్పటివరకూ 25 వేల మందికి పైగా ఖైదీలకు కరోనా సోకగా, సుమారు 350 మంది వరకూ మరణించారు. ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్ మీరు కూడా చూడండి..!

Loading...