Thursday, May 2, 2024
- Advertisement -

శివబాలాజీ, హరితేజ ఇక ఆ పని చేయడానికి రెడీ..?

- Advertisement -

బిగ్‌బాస్‌ కు చాలా మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇప్పుడు బిగ్ బాస్ సిజన్ 2 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ గా శివబాలాజీ నిలువగా, హరితేజ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని విజేత అయ్యింది. శివబాలాజీ, హరితేజ బిగ్ బాస్ ద్వారా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

సీరియస్‌గా ఉంటూనే మానవత్వంను చూపే వ్యక్తిగా శివబాలాజీ కనిపించగా, ఎప్పుడు అందరితో జాలీగా గడుపుతూ, అందరిని ఎంటర్‌టైన్‌ చేసే వ్యక్తిగా హరితేజ పేరు తెచ్చుకుంది. ప్రధానంగా హరితేజ చెప్పిన బుర్ర కథ బాగా హిట్ అయ్యింది. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లో హైలైట్స్‌ ఏంటి అంటే ఠక్కున వినిపించేవి మూడు పేర్లు.. ఒకటి ఎన్టీఆర్‌, రెండు హరితేజ మూడు ఇంటి సభ్యుల మద్య గొడవలు. శివబాలాజీ, హరితేజల మద్య జరిగిన కొన్ని టాస్క్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌ ముగిసిన తర్వాత కూడా వారిద్దరి గురించి తెగ మాట్లాడేసుకుంటున్నారు.

అందుకే వారిద్దరు కలిసి ఏదైనా షో చేస్తే.. ఆ షో సూపర్ హిట్ అవుతుందని బుల్లి తెర వర్గాల వారు భావిస్తున్నారు. అందుకే ఒక ప్రముఖ రియాల్టీ షో ప్రొడక్షన్‌ హౌస్‌ వారు వీరిద్దరిని షో కోసం సంప్రదించినట్లుగా తెలుస్తోంది. ఒక రియాల్టీ షో ద్వారా వీరిద్దరు యాంకర్స్‌గా త్వరలోనే బుల్లి తెరపై కనిపించబోతున్నారు. వీరిద్దరు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. డేట్స్ కంప్లీట్ అయ్యాక బుల్లితెరపైకి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -