Friday, April 26, 2024
- Advertisement -

పాల్‌ను వెన‌కుండి న‌డిపించేది వారేనా?

- Advertisement -

సెన్సెష‌న‌ల్ పొలిటీషియ‌న్‌.. ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గ‌త కొన్ని రోజులుగా మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో త‌న‌తో పొత్తు పెట్టుకోక‌పోతే మీ గెలుపు సాధ్యం కాదంటూ అధికార పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబుకు, ప్ర‌తిప‌క్ష పార్టీ వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు, ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. అమెరికా-ఉత్త‌ర‌కొరియా మ‌ధ్య విభేధాల ద‌గ్గ‌రి నుంచి ఏపీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల వ‌ర‌కు త‌న ద‌గ్గ‌ర ప‌రిష్కార మార్గాలు ఉన్నాయ‌ని తెలిపే పాల్‌.. గ‌త కొన్ని రోజులుగా తెలుగు మీడియాను ఊపేస్తున్నారు.

అన్ని మీడియాలలో… త‌మ‌ మీడియా వేర‌యా అన్న చందంగా ఉంటుంది మన తెలుగు మీడియా ప‌రిస్థితి. ఏదీ వార్త‌.. ప్ర‌జ‌ల‌కు ఏదీ అవ‌స‌రం? అన్న ప్రాతిప‌ద‌క‌న కాకుండా… కొంద‌రు వ్య‌క్తులు.. వారి అవ‌స‌రాల కోసం ప‌నిచేస్తుంటాయ‌నేది జ‌గ‌మెరిగిన వాస్త‌వం. తాము చూపించేదే నిజ‌మ‌ని న‌మ్మాల‌ని ప్ర‌జ‌ల‌పై రుద్దాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తుంటాయి. గ‌తంలో కాకుండా ఏదో సోష‌ల్ మీడియా పుణ్యామా అని వార్త‌ల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌టంతో.. ఎంతో కొంత నిజం ప్ర‌జ‌ల్లోకి వెళుతుంది. కానీ సోష‌ల్ మీడియాను కూడా దుర్వినియోగం చేసేవారు కూడా ఉన్నారు లేండీ.. అది వేరే విష‌యం. ఇక పాల్ విష‌యానికి వ‌స్తే.. కొన్ని మీడియా సంస్థ‌లు.. టీఆర్‌పీ రేటింగ్‌ల కోస‌మో.. లేక ప్ర‌జ‌ల్లో పాల్‌ను రిజిష్ట‌ర్ చేయాల‌నో తెలీదు కానీ పాల్‌ను అక్కున చేర్చుకుంటున్నాయి.

ఇక పాల్ త‌న‌కు అన్ని దేశాల అధినేత‌లు తెలుసంటారు.. తాను సీఎం అయితే రాష్ట్రానికి ఆర్థిక లోటు లేకుండా చేస్తానంటారు? కానీ ఇవ‌న్ని ఎలా సాధ్యమ‌వుతాయ‌న్న విష‌యాన్ని తెలుప‌రు? ఈ విష‌యాల‌ను ప్ర‌జ‌లు ఎలా రీసివ్ చేసుకుంటారో వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేద్దాం. కానీ ఓ వ‌ర్గం మీడియా పాల్‌ను ఈ మ‌ధ్య ఆకాశానికి ఎత్తేస్తుంది. ఆయ‌న చేసే వ్యాఖ్య‌ల‌కు అదిక ప్రాధాన్య‌త‌నిస్తుంది. కార‌ణం ఎంట‌న్న‌ది మాత్రం అంతుచిక్క‌డం లేదు.

కానీ ఈ స‌మ‌యంలో ఏ ప‌ని చేసినా అది ఓట్ల‌కోస‌మే అన్న‌ది వాస్త‌వం. ఓ ఆస‌క్తిక‌ర అంశం ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో స‌ర్య్కూలేట్ అవుతోంది. అధికార పార్టీ నేత‌ల సామాజిక వ‌ర్గ ఓట్లు ఈసారి కూడా వారికే ప‌డ‌తాయి. ఇక కాపుల విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కే త‌మ ఓట్లు వేస్తారు .. బీసీల విష‌యం కాసేపు ప‌క్క‌న పెడితే .. మిగిలింది షెడ్యూల్ కులాల‌వారు. వీరి ఓటు బ్యాంక్ వైఎస్ జ‌గ‌న్‌వైపే మొగ్గుచూపుతోంద‌ని అధికార పార్టీ నేతల అంచ‌నా. అందుకే వారిని త‌మ వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు విఫ‌లం చెందుతుండ‌టంతో … వారి ఓట్ల‌ను చిల్చే ప‌నిలో ఉన్నార‌ని టాక్‌. అందుకే ఒక‌ప్పుడు కాపుల ఓట్ల‌ను త‌మ వైపుకు తిప్పుకునేందుకు ప‌వ‌న్‌ను వాడుకున్న‌ట్లు.. ఈ సారి పాల్‌ను వాడేద్దామ‌ని ఫిక్స్ అయిన‌ట్టు స‌మాచారం. కానీ ప‌వ‌న్‌తో చెట్టాప‌ట్టాలేసుకొని తిరిగిన‌ట్టు తిర‌గ‌లేక.. ఆ బాధ్య‌తను త‌మ ప్ర‌చార ర‌థాలైన మీడియా అధిప‌తుల‌కు ఇచ్చిన‌ట్టున్నారు. అందుకే పాల్ ఏ చిన్న ప్రెస్ మీట్ పెట్టిన లైవ్‌లు ఇస్తూ.. ఆయ‌న‌చే విప‌క్ష నేత‌ల‌పై వ్యాఖ్య‌లు చేపిస్తూ బ్రేకింగ్‌లు నడుపుతున్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి..

మ‌రి తెలుగు ప్ర‌జ‌లు నిజంగానే పాల్‌ను ఫాలో అవుతున్నారా? లేక కాసేపైనా సీరియ‌స్ కామెడీని ఎంజాయ్ చెద్దామ‌నుకుంటున్నారా? అన్న విష‌యంలో మాత్రం క్లారిటీ లేదు. ఏమో మ‌రి వారిలో మ‌దిలోని ఏం మెదులుతుందో ఎవ‌రికి తెలుసు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -