సిడ్నీ మొద‌టి వ‌న్డేలో చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న భార‌త్‌…

346
India vs Australia 1st ODI : India three wickets lost 1st ODI In Sydney
India vs Australia 1st ODI : India three wickets lost 1st ODI In Sydney

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి మ్యాచ్‌లో భారత్ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకొని పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయింది. నాలుగు పరుగులకే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఆసీస్‌ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన టీమిండియా తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. రిచర్డ్‌సన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ మూడో బంతికి కోహ్లీ(3), ఐదో బంతికి రాయుడు(0) అవుటయ్యారు.

ప్రస్తుతం భారత్ 6 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 14 పరుగులు చేసింది. రోహిత్(6), ధోనీ (1) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 275 పరుగుల దూరంగా ఉండగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. కోహ్లి, రాయుడు వికెట్‌లను యువ పేసర్‌ రిచర్డ్‌సన్‌ తీసి ఆసీస్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. అంతకుముందు ఆసీస్‌ 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది.

4 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోవ‌డంతో చెత్త రికార్డు న‌మోదు చేసింది. తక్కువ పరుగులతో మొదటి మూడు వికెట్లు కోల్పోయిన జట్టుగా నిలిచింది. 2004లో జింబాబ్వేతో అడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కూడా భారత్ నాలుగు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ రికార్డును ఇప్పుడు సమం చేసుకుంది. 2005లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఐదు పరుగులకు, 1983లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆరు పరుగులకు భారత్ తన మొదటి మూడు వికెట్లు కోల్పోయింది.