అత‌ని కార‌ణంగానే నా కెరీర్‌ను మలుపు తిరిగింది : కోహ్లీ

433
Indian Captain Virat Kohli Praises Former Strength And Conditioning Coach Shanker Basu
Indian Captain Virat Kohli Praises Former Strength And Conditioning Coach Shanker Basu

ఫిట్‌నెస్‌ విషయంలో టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ చాలా కేర్ తీసుకుంటాడన్న విషయం తెలిసిందే. అత్యంత ఫిట్టెస్ట్ క్రికెట‌ర్ కోహ్లీనేనని తాజాగా సౌతాఫ్రికా మాజీ ప్లేయ‌ర్, మేటీ ఫీల్డ‌ర్ జాంటీ రోడ్స్ ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. అయుతే తనలో ఇలా ఫిట్ నెస్ కు కారణం ఎవరో కోహ్లీ తాజాగా చెప్పాడు. అత‌ని కార‌ణంగానే త‌న కెరీర్ మ‌లుపు తిరిగింద‌ని తెలిపాడు. తాజాగా భార‌త స్టార్ ఫుట్‌బాల‌ర్ సునీల్ చెత్రితో సోష‌ల్ మీడియాతో మాట్లాడుతూ త‌న మ‌న‌సులోని మాట‌లు చెప్పుకొచ్చాడు.

భార‌త మాజీ స్ట్రెంత్ అండ్ కండిష‌నింగ్ కోచ్ శంక‌ర్ బ‌స్ కార‌ణంగానే త‌న‌లో ఫిట్‌నెస్‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెరిగింద‌ని కోహ్లీ చెప్పాడు. మొదటిసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టులో బ‌సును చూశాన‌ని, అప్ప‌ట్లో ట్రైనింగ్‌లో భాగంగా లిఫ్టింగ్‌ను ప్ర‌వేశ‌పెట్టాడ‌ని గుర్తు చేసుకున్నాడు. తొలిసారి లిఫ్టింగ్‌ను చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని, అయితే కొన్ని రోజుల త‌ర్వాత దాని ఫ‌లితాలు త‌నకు అర్ధ‌మ‌య్యాయ‌ని పేర్కొన్నారు.

అలాగే త‌న డైట్‌పై కూడా దృష్టి సారించడంతో మ‌రిన్ని సానుకూల ఫ‌లితాలు సాధించాన‌ని చెప్పుకొచ్చాడు. ఇక దేశం తరుపున ఆడే క్రమంలో నిత్యం హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరముందని తెలిపాడు. ఇక తాను ఆడినంత కాలం ఫిట్‌నెస్‌పైనే దృష్టి పెడుతాన‌ని తెలిపాడు. ఇక ర‌వీంద్ర జ‌డేజా, కేఎల్ రాహుల్‌, హార్దిక్ పాండ్యా, సురేశ్ రైనా, జ‌స్‌ప్రీత్ బుమ్రా త‌దిత‌రులు కోహ్లీ కారణంగానే ఫిట్‌నెస్‌పై ఇన్‌స్పైర్ అయ్యారు.

Loading...