Wednesday, May 1, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అంటే భయపడిపోతున్నారు.. అందుకే!

- Advertisement -

ఓవైపు కరోనా కల్లోలంతో సతమతమవుతున్న ప్రజలకు బర్డ్ ఫ్లూ మరింత భయపెడుతోంది. అటు ఫ్లూ భయంతో చికెన్‌, ఎగ్స్‌ ధరలు పడిపోయాయి. కోడి మాంసం కొనేందుకు జనాలు ముందుకు రావడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో చికెన్‌ ఏకంగా రూ.15 కే అమ్మేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు 50 నుంచి 60 రూపాయలకే అమ్ముతున్నారు. అయినప్పటికీ ఎవరూ కొనేందుకు ముందుకురావడం లేదు.

ఉత్తరప్రదేశ్‌లోనూ ధరలు 25-30 శాతం పడిపోయాయి. మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, హర్యానా, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాల బర్డ్ ఫ్లూ భయం బెంబేలెత్తించింది. ఇప్పటికే ఈ రకమైన ఫ్లూ బయటపడినట్టు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ తెలిపింది. వలస పక్షుల్లోనే ఎక్కువగా ఈ ఫ్లూ కనిపిస్తోందని కేంద్రం వెల్లడించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం చికెన్ ధరలపై పడింది. కోళ్ల మరణాలతో జనం ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో చికెన్ ధరలు పతనమైయ్యాయి. జనం మంసం కోనాలంటే జంక్కుతున్నారు. ఇప్పుడు 180 రూపాయల నుంచి 160 రూపాయల వరకు ఉంది. చికెన్, కోడిగుడ్లు తినేవారు పూర్తిగా తగ్గినట్లు సమాచారం. పక్క రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -