Tuesday, April 30, 2024
- Advertisement -

పట్టులాంటి జుట్టు కావాలా? అయితే ఇలా చేయండి.!

- Advertisement -

మీ కేశాలు మ‌రింత‌గా అందంగా.. నాజుగ్గా మారాల‌నుకుంటున్నారా? మీ జుట్టు ఒత్తుగా పెరిగాలి…నిగ‌నిగ‌లాడాలి అని అనుకుంటున్నారా? అయితే, ఉల్లిని ట్రై చేయండి..! అదేంటి ఉల్లిని ట్రై చేయ‌డం అని అనుకుంటున్నారా? అదేనండి ఉల్లిలో మ‌న శ‌రీరానికి మేలు చేసే అనేక ర‌కాలైన ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. మరీ ముఖ్యంగా బ్యాక్టిరియా, ఫంగ‌స్‌ల‌ను త‌రిమికొట్టే గుణాలు అధికంగా ఉంటాయి.

అలాగే, కేశాల‌ను మ‌రింత మృదువుగా చేయ‌డంలో ఉల్లి కీల‌క పాత్ర పోషిస్తుంది. మ‌రీ ముఖ్యంగా జుట్టు ఉడిపోవ‌డాన్ని ఉల్లి త‌గ్గిస్తుంది. జుట్టు కుదుళ్ల‌ను ఒత్తుగా, బ‌లంగా చేస్తాయి. త‌ల‌పై చుండ్రు రాకుండా చేస్తుంది. ఉల్లిపాయ‌లో ఉండే స‌ల్ఫ‌ర్.. జుట్టు చిట్లిపోవ‌డాన్ని త‌గ్గిస్తుంది. అలాగే, కురులు తెగిపోవ‌డం, నిగారింపును కోల్పోవ‌డం, తెల్ల‌గా రంగుమార‌డం వంటి స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకుంటుంది ఉల్లిపాయ‌.

ఉల్లిపాయ‌ల నుంచి మీరు ఈ ప్రయోజ‌నాలు పొందాలంటే.. ముందుగా రెండు ఉల్లిపాయ‌లు తీసుకుని.. వాటి తొక్క‌తీసి, ముక్కలుగా క‌ట్ చేయండి. ఆ త‌ర్వాత గ్రైండ‌ర్లో వేసి గుజ్జుగా చేసిన అనంత‌రం, నీరు పోసి బాగా క‌ల‌పండి. కొద్ది స‌మ‌యం త‌ర్వాత ఒక గుడ్డ‌లో గుజ్జును వేసి దానిని పిండితే ఆనియ‌న్ జ్యూస్ వ‌స్తుంది. దీనిని త‌ల‌పై వెంట్రుక‌ల‌న్నింటికీ ప‌ట్టేలా మ‌ర్ద‌న చేయాలి. గంట త‌ర్వాత త‌ల స్నానం చేయాలి. ఇలా వారానికి ఒక రోజు.. రెండు నెల‌లు చేస్తే ఫ‌లితం మీకే తెలుస్తుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆస‌క్తిని పెంచుతున్న ప‌వ‌న్ పీరియాడిక్ మూవీ !

దానిమ్మ తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -