Wednesday, May 8, 2024
- Advertisement -

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం

- Advertisement -

భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ప‌లువురు కేంద్రమంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

1957 ఆగస్టు 27న కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ ఎన్వీ రమణ 1983 నుంచి న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, అనంత‌రం ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గానూ వ్య‌వ‌హ‌రించారు. 2014 ఫిబ్రవరి 17న జస్టిస్ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

ఇప్పుడు భారత సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నిలిచారు. 1966-67 మ‌ధ్య కాలంలో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐగా పనిచేశారు.

ఏపీ విద్యార్థుల‌కు మైక్రోసాఫ్ట్ మ‌ణిహారం

18 ఏళ్లు దాటిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -