Tuesday, April 30, 2024
- Advertisement -

కాంగ్రెస్‌ను వీడి కారెక్క‌నున్న కాంగ్రెస్ లీడ‌ర్‌ , టీమిండియా మాజీ కెప్టెన్‌…..?

- Advertisement -

తెలంగాణాలో మ‌రో కాంగ్రెస్ నేత టీమిండియా మాజీ కెప్టెన్ కారెక్కుతున్నారా….? సికీంద్రాబాద్ ఎంపీ టికెట్ ఖ‌రార‌య్యిందా…? టీఆర్ఎస్ పెద్ద‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారా అంటే అవున‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు. ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూట‌మిని చిత్తు చేసి మ‌రో సారి అధికారంలోకి వ‌చ్చింది టీఆర్ఎస్‌. దాంతో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు కారెక్కెందుకు సిద్ద‌మ‌వుతున్నారు. కారెక్కుత్త‌న్న వారిలో మాజీ టీమిండియా కెప్టెన్ అజారుద్దీన్ ఉన్న‌ట్లు వార్త‌లు గుప్పుమంటున్నాయి.

2009 ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన అజార్, అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 2014 ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేయ‌లేదు. తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో భాగంగా అజార్‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌గా అధిష్టానం నియ‌మించింది. అయితే అనూహ్య‌రీతిలో కూట‌మి ఓడిపోవ‌డంతో ఇప్పుడు త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై దృష్టి సారించారంట మాజీ కెప్టెన్.

ఇప్ప‌టికే టీఆర్ఎస్ పార్టీ పెద్ద‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని…సికీంద్రాబాద్ పార్ల‌మెంట్ స్థానం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఎన్నిక ప్ర‌చారంలో టీఆర్ఎస్‌ను ఘోరంగా విమ‌ర్శించిన అజార్ ఇప్పుడు కారు ఎలా ఎక్కుతార‌ని ప్ర‌త్య‌ర్థి పార్టీలు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల మాట‌లు ప‌ట్టించుకుంటే భ‌విష్య‌త్తు ఉండ‌ద‌నే ఆలోచ‌న‌తో కారెక్కేందుకు సిద్వ‌మ‌య్యారంట‌. మ‌రి ఇంత‌లో ఎంత నిజం ఉందో తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -