Tuesday, April 30, 2024
- Advertisement -

అమెరికా పౌర‌స‌త్వం వ‌దులుకొని వైసీపీలోకి ద‌గ్గుపాటి వార‌సుడు

- Advertisement -

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. అనేక మంది నేత‌లు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీల్లో టికెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక మంది సీనియర్ నేతలు… ఇప్పటికే ఈ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన… ఇలా అన్ని పార్టీల్లోనూ తనయుల టికెట్ల కోసం నాయకులు ఇప్ప‌టినుంచే తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

తాజాగా ద‌గ్గుపాటి వార‌సుడు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారంట‌. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి తనయుడైన హితేష్ రాజకీయాల్లోకి అడుగుపెడతారనే వార్తలు చాలాకాలం నుంచే వినబడుతున్నాయి. తాజాగా హితేష్ రాజకీయ అరంగ్రేటం వైసీపీ నుంచే అని ఊహాగానాలు జోరందుకున్నాయి. తన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాతినిథ్యం వహించిన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున హితేష్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.

అయితే సాంకేతిక సమస్యలను అడ్డు తొలగించుకొనేందుకు హితేష్ ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. రితేష్‌కు అమెరికా పౌర‌స‌త్వం ఉంది. అమెరికా పౌర‌స‌త్వం ఉంటే దేశంలో చట్టసభలకు పోటీ చేయకూడదు. దీన్ని వదిలివేసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు హితేష్ అమెరికా ప్రభుత్వానికి కొన్ని రోజుల క్రితం లేఖ రాశారు. అమెరికా సిటిజన్‌షిప్ వదిలేసేందుకు రాసిన లేఖపై ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. హితేష్ కు అమెరికా నుండి ఈ విషయమై సమాచారం వచ్చిన వెంటనే వైసీపీలో చేరే విషయాన్ని హితేష్ ప్రకటించే ఛాన్స్ ఉంది. రెండు మూడు రోజుల్లో అమెరికా ప్రభుత్వ నుండి ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందిన పురంధేశ్వరీ సన్నిహితులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -