Tuesday, May 7, 2024
- Advertisement -

తెలంగాణా ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌…బాలికలదే పైచేయి

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర‌ ఇంటర్మీడియట్‌ ఫలితాలు ఇవాళ సాయంత్రం 5 గంటలకు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్ధన్‌ రెడ్డి విడుదల చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి మార్చి 18 వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో బాలికలదే పైచేయి సాధించారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 2,70,575 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 65 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షా ఫలితాల్లో 76 శాతంతో మేడ్చల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 29 శాతంతో మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది.

విద్యార్థులు ఫలితాలను ఈ వెబ్‌సైట్‌ http://examresults.ts.nic.in/ లో లాగినై తెలుసుకోవచ్చు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -