Tuesday, April 30, 2024
- Advertisement -

నీటి గొడవలు.. ఇంకా ఎన్నాళ్లు?

- Advertisement -

సమన్వయ లోపమో.. ఒకరికొకరు సహకరించుకోవడంలో ఉన్న ఇబ్బందో తెలియదు కానీ.. కృష్ణా జలాల పంపకం వ్యవహారం రోజురోజుకూ ఆంధ్రా తెలంగాణ మధ్య వివాదంగా మారుతోంది. ఈ విషయంలో ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చలు కూడా.. రెండు రాష్ట్రాల మధ్య అంగీకారాన్ని తీసుకురాలేకపోయాయి. సమస్య పరిష్కారానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో జరిగిన చర్చలకు.. తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు, దేవినేని ఉమ హాజరయ్యారు. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పారు. కేంద్రం సూచనతో.. ఇద్దరూ ప్రత్యేకంగా చర్చలు కూడా చేశారు.

కానీ.. ఇద్దరూ కలిసి సమస్య పరిష్కారానికి మాత్రం ఓ అంగీకారానికి రాలేకపోయారు. ఏపీ చేస్తున్న వితండవాదమే ఇందుకు కారణమని హరీష్ రావు బలంగా ఆరోపిస్తున్నారు. న్యాయంగా తమకు అందాల్సిన వాటా రావాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే.. ఉన్నత న్యాయస్థానానికి అయినా వెళ్తామని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. దేవినేని ఉమ కూడా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబడుతున్నారు. తమ ప్రాంత పరిధిలో ఉన్న ప్రాజెక్టు గేట్లను తామే నిర్వహించుకునే అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదే.. రెండు రాష్ట్రాల మధ్య మరింత అగాథానికి కారణమవుతోంది.

మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం.. మహారాష్ట్రతో కలిసి కట్టబోయే ఉమ్మడి ప్రాజెక్టుల పనిని మరింత వేగవంతం చేస్తోంది. ఇన్నాళ్లూ మహారాష్ట్రతో ఉన్న నీటి గొడవలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ.. అడుగులు ముందుకు వేస్తోంది. ఇదే తరహాలో.. ఏపీ ప్రభుత్వం కూడా తమ ప్రయోజనాలు కాపాడుకుంటూనే.. తెలంగాణతో స్నేహం కొనసాగిస్తే భవిష్యత్ అవసరాలకు మంచిదన్న అభిప్రాయం వినబడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -