Tuesday, April 30, 2024
- Advertisement -

బంగ్లా బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేసిన ఇంగ్లండ్‌…387 ప‌రుగుల భారీ టార్గెట్‌

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ అంచనాలకు తగ్గట్లుగా సాగింది. ఊహించిన‌ విధంగానె భారీ స్కోర్లు న‌మోదువుతున్నాయి. బంగ్లాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మేన్‌లు బంగ్లా బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. అంద‌రి బౌలింగ్ ఉతికి ఆరేశారు. (153: 121 బంతుల్లో 14ఫోర్లు, 5సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో(51: 50 బంతుల్లో 6ఫోర్లు), జోస్ బట్లర్(64: 44 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) తమదైన శైలిలో రెచ్చిపోవడంతో 50 ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్లకు 386 పరుగులు చేసింది.

బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆతిథ్య జట్టును బంగ్లాదేశ్ బౌలర్లు ఏదశలోనూ కట్టడి చేయలేకపోయారు. వికెట్లు తీసినప్పటికీ కీలక సమయంలో భాగస్వామ్యాలు విడదీయకపోవడంతో భారీ మూల్యమే చెల్లించుకున్నారు. బ్యాట్స్‌మేన్‌లు వీర‌విహారం చేయ‌డంతో బంగ్లా బౌల‌ర్లు చేతులెత్తేశారు.

బంగ్లా బౌలర్లలో మెహిదీ హసన్, మహమ్మద్ సైఫుద్దీన్ చెరో రెండు వికెట్లు తీయగా.. మొర్తజా, ముస్తాఫిజుర్ రహీమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. కెప్టెన్ మొర్తజా మినహా అందరూ ధారళగంగా పరుగులిచ్చుకున్నారు.టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలి 4 ఓవర్లకు ఇంగ్లాండ్ స్కోరు కేవలం 9 పరుగులే. కానీ క్రీజులో కుదురుకున్నాక స్కోరు బోర్డు జెట్‌వేగంతో దూసుకెళ్లింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -