Thursday, May 2, 2024
- Advertisement -

వైరస్ సోకిన ఆ ఐటీ ఉద్యోగి హైదరబాద్ రాకముందు ఎక్కడ ఉన్నాడంటే ?

- Advertisement -

ఓ ఐటీ ఉద్యోగికి కొవిడ్ వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇతను గడిన పదిహేను రోజులుగా ఎక్కడ ఉన్నాడన్న విషయాల మీద అధికారులు కిందా మీదా పడ్డారు. అతని టైం హిస్టరీని సిద్దం చేసి.. అతను ఎక్కడికి వెళ్లాడు.. ? ఎవర్ని కలిశాడు అనే విషయాలను అధికారులు గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం ప్రక్రియను సీక్రెట్ గా ఉంచారు. దీనికి సంబంధించిన ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది. హైదరాబాద్ కు వచ్చిన ఆ ఐటీ ఉద్యోగి ఫిబ్రవరి రెండో వారం నుంచి ఎక్కడున్నాడు? ఏం చేశాడన్న విషయానికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.

ఫిబ్రవరి 15 బెంగళూరు నుంచి దుబాయ్ కు వెళ్లారు
ఫిబ్రవరి 16 దుబాయ్ నుంచి సింగపూర్ వెళ్లారు. అక్కడే మూడు రోజులు ఉన్నారు
ఫిబ్రవరి 19 సింగపూర్ లో ఉండి కంపెనీ పని చేసిన అతడు.. మరో ఉద్యోగితో కలిసి పని చేశాడు
ఫిబ్రవరి 20 సింగపూర్ లో పని పూర్తి చేసుకొని బెంగళూరు చేరుకున్నారు
ఫిబ్రవరి 21 విదేశీ పర్యటన తర్వాత బెంగళూరులోని ఆఫీసుకు వచ్చాడు. రెండు రోజులు అక్కడే పని చేశాడు
ఫిబ్రవరి 21 ఒంట్లో నలతగా ఉండటంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరాడు
ఫిబ్రవరి 22 హైదరాబాద్ కు వచ్చాక.. జ్వరంతో సికింద్రాబాద్ అపోలోకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు
ఫిబ్రవరి 23 హైదరాబాద్ కు చేరుకున్న నాలుగు రోజుల తర్వాత నుంచి కొవిడ్ లక్షణాలు మొదలయ్యాయి
ఫిబ్రవరి 27 సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరాడు.
ఫిబ్రవరి 29 అపోలో ఆసుపత్రిలో చేరిన అతడు.. రెండు రోజులు ఆసుపత్రిలోనే చికిత్స చేయించుకున్నాడు
మార్చి 01 అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో బైలేటరల్ లోయర్ లోబ్ న్యుమెనియా పరీక్ష చేశారు
మార్చి 01 కొవిడ్ లక్షణాలు తేలటంతో అతడ్ని గాంధీకి షిఫ్ట్ చేశారు

మార్చి 02 సాయంత్రం అతడికి రక్త పరీక్షలు జరపడం.. అనుమానిత కేసుగా స్క్రీనింగ్ టెస్టు చేశారు. చివరకు మార్చి 2న ఉదయం తొమ్మిది గంటలకు కొవిడ్ పాజిటివ్ కేసుగా నిర్ధారణ చేశారు. దాంతో తెలంగాణలో తొలి కొవిడ్ పాజిటివ్ కేసును గుర్తించినట్లుగా కేంద్రం ప్రకటించింది. ఇలా బెంగళూరు నుంచి సింగపూర్ కు వెళ్లిన అతగాడి జర్నీ.. హైదరబాదీయులకు పెద్ద ప్రమాదం తీసుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -