Sunday, April 28, 2024
- Advertisement -

నంది అవార్డ్స్ ప్ర‌క‌టించిన‌ ప్ర‌భుత్వం.. ఉత్త‌మ చిత్రాలుగా లెజెండ్‌, బాహుబ‌ళి 1, పెళ్ళి చూపులు

- Advertisement -

సినీరంగంలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులకు ఏటా ఇచ్చే నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అమ‌రావ‌తిలో ఏర్పాటు మీడియా స‌మావేశంలో నంది అవార్డుల‌ను ప్ర‌కటించారు. 2014, 2015, 2016 సంవ‌త్స‌రాల‌కు నంది అవార్డుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను జ్యూరీ స‌భ్యులు తెలిపారు.

2014, 2015, 2016 సంవత్సరాలకు ప్రభుత్వం ఇంతకు ముందే కమిటీలను నియమించింది . నటుడు గిరిబాబు, నిర్మాత పోకూరి బాబురావు, జీవిత రాజశేఖర్ అధ్యక్షతన మూడు కమిటీల సభ్యులు ఇప్పటికే హైదరాబాద్‌లో సినిమాలను చూశారు. కాగా అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హీరో బాలయ్య, మురళీ మోహన్ అధ్యక్షతన ఈ అవార్డ్స్‌ను ప్రకటించారు.

నంది అవార్డుల వివరాలు..

ఉత్తమ చిత్రాలు..
2014 ఉత్తమ చిత్రం: లెజెండ్
2015 ఉత్తమ చిత్రం: బాహుబలి
2016:ఉత్తమ చిత్రం: పెళ్లి చూపులు

ఉత్తమ నటులు..

2014 ఉత్తమ నటుడు: బాలయ్య
2015 ఉత్తమ నటుడు: మహేష్ బాబు (శ్రీమంతుడు)
2016:ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్

ఉత్తమ నటి..

2014 ఉత్తమ నటి: అంజలి (గీతాంజలి)
2015 ఉత్తమ నటి: అసుష్క(సైజ్ జీరో)

ఎన్టీఆర్ జాతీయ అవార్డులు..

2014 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: కె.రాఘవేంద్రరావు
2015 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: రజనీకాంత్,
2016 ఎన్టీఆర్ జాతీయ అవార్డ్: కమల్ హాసన్‌

ఇతర అవార్డులు:
ఉత్తమ సహాయనటుడు నాగచైతన్య (మనం)
ఉత్తమ సహాయనటి మంచు లక్ష్మీ (చందమామ కథలు)
ఉత్తమ హాస్యనటుడు బ్రహ్మానందం (రేసు గుర్రం)
ఉత్తమ హాస్యనటి విద్యుల్లేఖ (రన్ రాజా రన్)
ఉత్తమ కెమెరామెన్ సాయిశ్రీ రామ్ (అలా ఎలా)
ఉత్తమ పాటల రచయిత చైతన్య ప్రసాద్ (బ్రోకర్2)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -