Tuesday, April 30, 2024
- Advertisement -

‘బ్లఫ్ మాస్టర్’ రివ్యూ

- Advertisement -

జ్యోతిల‌క్ష్మి,క్షణం, ఘాజీ, అంతరిక్షం సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్న న‌టుడు స‌త్య‌దేవ్ హీరోగా మారి చేసిన సినిమా బ్లఫ్ మాస్టర్.తమిళంలో విజయవంతమైన ‘శతురంగ వేట్టై’ సినిమా ఆధారంగా బ్లఫ్ మాస్టర్ సినిమాను తెరకెక్కించారు.సత్యదేవ్, నందితాశ్వేతా జంటగా తెర‌కెక్కిన ఈ సినిమా ఈ రోజే విడుద‌లైంది ట్రైల‌ర్‌తోనే సినిమా కంటెంట్ ఏంటో చెప్పేసింది ఈ సినిమా . ట్రైల‌ర్‌ను చూసిన ప్ర‌తి ఒక్క‌రు చాలా బాగుంద‌ని కితాబు ఇచ్చారు.ఈ రోజే విడుద‌లైన ఈ సినిమా ఎలా ఉందో ప్రాధ‌మిక మాద్య‌మాల ద్వారా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

కథ‌ :
ఉత్తమ్‌ కుమార్‌ (సత్యదేవ్‌) ఏడేళ్ల వయస్సులో తన తల్లిదండ్రుల మరణంతో సమాజం మీద ద్వేషం పెంచుకుంటాడు. ఇక్కడ బతకాలంటే డబ్బు కావాలి. ఆ డబ్బు కోసం ఎలాంటి మోసం చేయడానికైనా సిద్ధపడతాడు. మనం నమ్మి చేసేది ఏది మోసం కాదని భావించే ఉత్తమ్‌ రకరకాల పేర్లతో ఎన్నో మోసాలు చేస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసినా డబ్బుతో సాక్షాలను, లాయర్లను కొని బయట పడతాడు. ఇలా అడ్డదారిలో వెళుతున్న ఉత్తమ్ మంచి వాడిగా ఎలా మారాడు అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు :
సినిమా అంతా సత్యదేవ్‌ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. మాటలతో మాయ చేసి మోసం చేసే పాత్రలో సత్యదేవ్‌ నటన వావ్‌ అనిపిస్తుంది. ప్రతీ సన్నివేశంలోనూ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. మోసగాడిగా కన్నింగ్ లుక్స్‌లో మెప్పించిన సత్య, సెకండ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ అంతే బాగా ఆకట్టుకున్నాడు. అవని పాత్రలో నందితా శ్వేత ఒదిగిపోయింది.ఇతర పాత్రల్లో ఆదిత్య మీనన్‌, సిజ్జు, వంశీ, చైతన్య తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.

థియోట‌ర్స్‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కుడిని కదలకుండా కూర్చోబెడ్డటంలో దర్శకుడు విజయం సాధించాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

బోట‌మ్ లైన్ : కాస్టింగ్‌ను కాదు క‌థ‌ను నమ్మి తీసిన సినిమా



Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -