మరో విలక్షణ పాత్రలో సత్యదేవ్..!

- Advertisement -

యువ హీరో సత్యదేవ్ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమైన సత్యదేవ్ ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తూనే సపోర్టింగ్ రోల్స్, వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. తాజాగా సత్య దేవ్ కి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది. చిరంజీవి హీరోగా మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోతో పాటు హీరో చెల్లెలి పాత్ర కూడా కీలకం. మలయాళ లూసిఫర్ మూవీలో హీరోగా నటించిన మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్ నటించింది. ఆమె భర్త పాత్రలో, విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటించాడు. తెలుగులో ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్ ని తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే డిఫరెంట్ రోల్స్ తో ఆకట్టుకుంటున్న సత్యదేవ్ విలన్ గా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.

- Advertisement -

ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రకు సీనియర్ నటి సుహాసినిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే విలన్ గా సత్యదేవ్ ని తీసుకోవడంతో ఆ పాత్రకు సుహాసినిని కాకుండా ఎవరైనా యువ నటిని తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. అతి త్వరలోనే లూసిఫర్ రీమేక్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మలయాళంలో మోహన్ లాల్ అనుచరుడిగా మరో హీరో పృథ్వీ రాజ్ నటించాడు. మొదట ఆ పాత్ర కోసమే సత్యదేవ్ ని తీసుకున్నారని ప్రచారం జరిగినా చివరికి విలన్ గా ఎంచుకున్నారు. మరి చిరంజీవి అనుచరుడిగా ఎవరిని ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.

Also Read

బిగ్​బాస్​ 5 కంటెస్టెంట్లు ఎవరంటే?

విడుదలకు ముందే ఏకే రికార్డ్స్..

అన్ని భాషల్లోనూ ఫుల్​ బిజీ హీరోయిన్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -