Friday, May 3, 2024
- Advertisement -

టాలీవుడ్‌ పెద్దలకు సీఎం హెచ్చరిక..? సాహోకి షాక్

- Advertisement -

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ప్రభాస్ ‘సాహో’ చిత్రం రేపు విడుదల కాబోతోంది. భరీ భడ్జెట్ కావడంతో ధరలు పెంచుకొనేందుకు సినిమా యూనిట్ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. కాని టికెట్ల ధలరను పెంచుకొనేందుకు అనుమతి నిరాకరించడంతో సాహో కు భారీ షాక్ తగిలింది. సాహో లాంటి భారీ బడ్జెట్ సినిమాకు మొదటి వారం టికెట్ల రేట్లు పెంచుకోవడం ద్వారా కొంత మేర లబ్ధి పొందుతామని భావించే నిర్మాతలకు ఇది షాకింగ్ అనే చెప్పాలి.

టికెట్ల ధర పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి జగన్ తో అధికారులు ప్రస్తావించారు. అయితే, ధర పెంపుకు జగన్ సుముఖత చూపలేదని సమాచారం. ఒక్కో సినిమాకు ఒక్కో ధర ఉండటం సరికాదని ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం సాహోకు మాత్ర మే పరిమితం కాదని టాలీవుడ్ మొత్తానికి వర్తిస్తుందనే అభిప్రాయం సినిమావర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు సాహో సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి నో చెప్పిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు చిరంజీవి సైరా నరసింహారెడ్డికి కూడా అదే ఫార్ములా అమలు చేస్తుందనడంలో సందేహంలేదు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావడం తెలుగు సినీ పరిశ్రమకు ఇష్టం లేదని 30 ఇయర్స్ పృథ్వీ గతంలోనె ఆరోపనలు చేశారు.చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యి ఉంటే తెల్లవారుజామున ఫ్లైట్‌కే వెళ్లి ఆయన్ను అభినందించేవారని చెప్పారు. సినిమా ఇండస్ట్రీలో కొందరు జగన్ కు మద్దతిచ్చినా …ముఖ్యమైన వారు జగన్‌ను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అలాంటప్పుడు వారికి రాయితీలు, ఇతరత్రా లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏంటనే వాదన వైసీపీలో ఉంది. మరి దీనిపై టాలీవుడ్ పెద్దలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -