Wednesday, May 1, 2024
- Advertisement -

దేవిశ్రీ ప్రసాద్ మరో ఫిలిం ఫేర్ అవార్డు..!

- Advertisement -

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి సినిమాకైన అతను ఇచ్చే మ్యూజీక్ అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య మ్యూజిక్ విషయంలో విమర్శలు ఎదుర్కుంటున్నాడు తప్పిస్తే గతంలో ఎప్పుడు అతని మ్యూజిక్ పై విమర్శలు రాలేదు. అయితే భరత్ అనే నేను, మహర్షి సినిమాల విషయంలో ఒకేరకైన సాంగ్స్ ఇచ్చాడనే విమర్శలు బాగా వచ్చాయి.

దాంతో ’సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన దేవిశ్రీ.. ఆ తర్వాత మంచి మంచి ఆల్బమ్స్ ఇచ్చాడు. ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. అలానే తమిళంలో కూడా స్టార్ హీరోలకు పని చేస్తున్నాడు. అయితే ఇప్పటికే దేవికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎనిమిది ఫిలిం ఫేర్ అవార్డులు వచ్చాయి.

తాజాగా మరో ఫిలిం ఫేర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. చెన్నైలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ‘రంగస్థలం’ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా 9వ ఫిలిం ఫేర్‌ అవార్డును అందుకున్నారు దేవి. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో అత్యధికంగా ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న సంగీత దర్శకుడిగా దేవీశ్రీ నిలిచారు. ఆయన తరవాత స్థానంలో యం.యం.కీరవాణి ఉన్నారు. కీరవాణి ఇప్పటి వరకు 7 ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -